Share News

ముమ్మరంగా వాహనాల తనిఖీ

ABN , Publish Date - May 04 , 2024 | 11:53 PM

మెదక్‌ అర్బన్‌/జహీరాబాద్‌/చేర్యాల/జగదేవ్‌పూర్‌, మే 4: పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో భారీగా నగదు పట్టుబడుతున్నది. శనివారం పలు మండలాల్లో రూ.5,49,000 లక్షల నగదు పోలీసుల తనిఖీల్లో పట్టుబడింది.

ముమ్మరంగా వాహనాల తనిఖీ
చేర్యాల మండలం గుర్జకుంట చెక్‌పోస్ట్‌ వద్ద పట్టుబడిన నగదును సీజ్‌ చేస్తున్న పోలీసులు

మెదక్‌ అర్బన్‌/జహీరాబాద్‌/చేర్యాల/జగదేవ్‌పూర్‌, మే 4: పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో భారీగా నగదు పట్టుబడుతున్నది. శనివారం పలు మండలాల్లో రూ.5,49,000 లక్షల నగదు పోలీసుల తనిఖీల్లో పట్టుబడింది. మెదక్‌ పట్టణంలో వెల్‌కం బోర్డు వద్ద శనివారం వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా.. (టీఎస్‌ 08 కేజీ 7438) నెంబరు గల కారులో ఎలాంటి రశీదు లేకుండా తరలిస్తున్న రూ.2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ దిలీ్‌పకుమార్‌ తెలిపారు. కేసు నమోదు చేసి జిల్లా గ్రీవేన్స్‌ సెల్‌ కార్యాలయానికి తరలించినట్లు ఆయన వెల్లడించారు. మొగుడంపల్లి మండలంలోని మాడ్గి చెక్‌పోస్టువద్ద శనివారం వాహనాల తనఖీల్లో బాగంగా రూ.1.50 లక్షలను పట్టుకున్నామని చిరాగ్‌పల్లి ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు. గుల్బర్గాకు చెందిన ప్రేమలత కారులో రూ.1.50 లక్షలను హైదరాబాద్‌కు తరలిస్తున్న క్రమంలో పట్టుకున్నామని తెలిపారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లని కారణంగా సీజ్‌చేసి, ఎన్నికల అధికారులకు అప్పగించామన్నారు. చేర్యాల మండలం గుర్జకుంట చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసులు నిర్వహిస్తున్న వాహన తనిఖీలో శనివారం రూ.54 వేల నగదు పట్టుకుని సీజ్‌ చేశారు. ధూళిమిట్ట మండలం హనుమంతుతండాకు చెందిన భూక్యా సురేశ్‌ కారును తనిఖీ చేయగా, అతడి వద్ద రూ.54 వేలు పట్టుబడ్డాయి. ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో సీజ్‌ చేసినట్లు సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. ఆయనవెంట ఎస్‌ఐ దామోదర్‌ ఉన్నారు. మండల కేంద్రమైన జగదేవ్‌పూర్‌లో పోలీసులు నగదు పట్టుకున్నారు. జగదేవ్‌పూర్‌లో స్టాటికల్‌ సర్వేలెన్సు టీమ్‌ సిబ్బందితో కలిసి జగదేవ్‌పూర్‌ పోలీ్‌సస్టేషన్‌ ఎదురుగా ఉన్న చెక్‌పోస్ట్‌ వద్ద వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా స్టేషన్‌ ఘనపూర్‌కు చెందిన కుమార్‌ వద్ద రూ.1,45,000 లక్షలను పట్టుకున్నామని ఎస్‌ఐ చంద్రమోహన్‌ తెలిపారు.

Updated Date - May 04 , 2024 | 11:53 PM