Share News

పేద వర్గాలపై ఆర్థికభారం మోపిన మోదీ

ABN , Publish Date - May 04 , 2024 | 11:54 PM

హుస్నాబాద్‌, మే 4: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో కుబేరులను పెంచిపోషిస్తూ పేద వర్గాలపై ఆర్థిక భారం మోపిందని ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్‌, ప్రొఫెసర్‌ వెంకట్‌నారాయణ అన్నారు.

పేద వర్గాలపై ఆర్థికభారం మోపిన మోదీ
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ప్రజా సంఘాల జేఏసీ నాయకులు

ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్‌, ప్రొఫెసర్‌ వెంకట్‌నారాయణ

హుస్నాబాద్‌, మే 4: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో కుబేరులను పెంచిపోషిస్తూ పేద వర్గాలపై ఆర్థిక భారం మోపిందని ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్‌, ప్రొఫెసర్‌ వెంకట్‌నారాయణ అన్నారు. శనివారం ఆయన హుస్నాబాద్‌ పట్టణంలోని రిటైర్డు ఉద్యోగుల సంఘ భవనంలో జరిగిన ‘ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం-సామాజిక న్యాయం సాధించుకుందాం’ అనే కరపత్ర విడుదల కార్యక్రమంలో మాట్లాడారు. దశాబ్ద కాలం నుంచి బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఏ ఆర్థిక ప్రయోజనం చేసే పథకాలు అందించకపోవడం శోచనీయమన్నారు. సామాన్య వినియోగదారులపై డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌ జీఎస్టీ మొదలకు పన్నులు విధించి రూ.70 లక్షల కోట్లు నిర్దాక్షిణ్యంగా వసూలు చేసిందని ఆరోపించారు. సంపన్నుల అభివృద్ధిని చూసి దేశం అభివృద్ధి అయ్యిందని ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉన్నదన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతాన్ని అన్నిరకాల దోపిడీ చేసిందని ఆరోపించారు. బీఆర్‌ఎ్‌సకు ఓటువేయడం అంటే బొందలో వేయడమేనని తెలిపారు. కాంగ్రెస్‌ నిలబెట్టిన అభ్యర్థులకు ఓటు వేసి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల జేఏసీ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ సంఘని మల్లేశ్వర్‌, ఎదులాపురం తిరుపతి, వంగల సుధాకర్‌, హుస్నాబాద్‌ జేఏసీ కో అర్డినేటర్‌ మేకల వీరన్నయాదవ్‌, తక్కలపల్లి రాజగోపాల్‌రావు, పుల్లూరు సుధాకర్‌, పొన్నాల ఫ్రాన్సిస్‌, లక్ష్మణ్‌గౌడ్‌, వీరసోమయ్య, రవీంద్రాచారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2024 | 11:55 PM