Share News

కాంగ్రెస్‌తో సుస్థిర పాలన

ABN , Publish Date - May 04 , 2024 | 11:04 PM

కాంగ్రెస్‌ పార్టీతోనే సుస్ధిరపాలన అందుతుందని బెల్లంపల్లి, చెన్నూరు ఎమ్మెల్యేలు గడ్డం వినోద్‌, గడ్డం వివేక్‌ వెంకట స్వామి అన్నారు. శనివారం కొండాపూర్‌యాపలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. తెలంగాణ ఆకాంక్షలను తుంగలో తొక్కిన బీఆర్‌ఎస్‌, ప్రజాసంక్షేమం మరిచి దేశ సంపదను ఆదాని, అంబానీలకు పంచి పెడుతున్న బీజేపీని పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓడించాలన్నారు.

కాంగ్రెస్‌తో సుస్థిర పాలన

కాసిపేట, మే 4: కాంగ్రెస్‌ పార్టీతోనే సుస్ధిరపాలన అందుతుందని బెల్లంపల్లి, చెన్నూరు ఎమ్మెల్యేలు గడ్డం వినోద్‌, గడ్డం వివేక్‌ వెంకట స్వామి అన్నారు. శనివారం కొండాపూర్‌యాపలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. తెలంగాణ ఆకాంక్షలను తుంగలో తొక్కిన బీఆర్‌ఎస్‌, ప్రజాసంక్షేమం మరిచి దేశ సంపదను ఆదాని, అంబానీలకు పంచి పెడుతున్న బీజేపీని పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓడించాలన్నారు. తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడి 1200 మంది యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని, కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని కేసీఆర్‌ ప్రభుత్వం అప్పులకుప్పగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం అప్పుల పాలైతే కేసీఆర్‌ కుటుంబం ఆస్తు లను కూడబెట్టుకుందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను అమలు చేశామన్నారు. ఆగస్టు 15లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. మహా లక్ష్మీ పథకాన్ని ఎన్నికల కోడ్‌ ముగియగానే అమలు చేస్తామన్నారు. పెద్దపల్లి పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధి గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రజలందరు ఆశీర్వదించి తనను పార్లమెంట్‌కు పంపితే కేంద్రం నుంచి నిధులు తెచ్చి ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఇప్పటికే సొంతంగా బైక్‌ల తయారీ కంపెనీ ఏర్పాటు చేసి 500 మందికి ఉద్యోగాలు కల్పించానని తెలిపారు. కాకా కుటుంబం పదవుల్లో లేనప్పటికి విశాఖ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, నాయకులు రత్నం ప్రదీప్‌, గడ్డం జగన్నాధం, మేరుగు పద్మశంకర్‌, సత్తయ్య, రాపర్తి శ్రీనివాస్‌, నర్సింగం పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ హయాంలోనే పేదలకు లబ్ధి

తాండూర్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలోనే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అంది లబ్ధి పొందుతారని పెద్దపల్లి పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. కిష్టంపేట, తాండూర్‌ గ్రామాల్లో ఎమ్మెల్యే గడ్డం వినోద్‌వెంకటస్వామితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఐబీ కేంద్రంలోని హోటల్‌లో దోసెలు వేస్తూ ప్రచా రం చేశారు. ఉపాధిహామీ కూలీల వద్దకు వెళ్లి కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు వేయాలని కోరారు. ఆయన మాట్లాడుతూ బీజేపీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు ప్రజా సంక్షేమ పథకాలు అమలులో పూర్తిగా విఫలమ య్యారన్నారు. 2006లో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే ఉపాధిహామీ పథకం ప్రారంభమైందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రజలకు న్యాయం జరగలేదని, నాయకులు, కార్యకర్తలు మాత్రమే బాగుపడ్డారని తెలిపారు. ఎమ్మెల్యే వినోద్‌వెంకటస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాల్లో భాగం గా ఐదు గ్యారంటీ పథకాలను అమలు చేసిందని, త్వరలో రైతులకు రుణమాఫీ, మహిళలకు ప్రతీ నెల రూ.2500 నగదు అందిస్తామ న్నారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ చేతి గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఎండీ ఈసా, సూరం రవీందర్‌రెడ్డి, యశోధ, శంకర్‌ పాల్గొన్నారు.

జైపూర్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే అన్ని వర్గాల అభివృద్ధి జరుగు తుందని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. మండలంలోని ఇందారంలో ఉపాధిహామీ కూలీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 13న జరిగే పార్లమెంట్‌ ఎన్ని కల్లో హస్తం గుర్తుకే ఓట్లు వేసి కాంగ్రెస్‌ అభ్యర్ధి గడ్డం వంశీని గెలిపించాలని సూచించారు. మండల నాయకులు పాల్గొన్నారు.

మందమర్రిటౌన్‌: బీజేపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమి లేదని, పరిశ్రమల మూసివేత, నిరుద్యోగం పెరిగిపోయిందని ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. ఐఎన్‌టీయూసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు పరిశ్రమలను జాతీయీకరణ చేస్తే మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత లాభాల్లో ఉన్న వాటిని ప్రైవేటు పరం చేశారని మండిప డ్డారు. గడ్డం వంశీ వివేక్‌ను గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, కాంపెల్లి సమ్మయ్య, దేవి భూమయ్య, పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2024 | 11:04 PM