Share News

కొత్త పాసుపుస్తకం దరఖాస్తుకు రూ.1000

ABN , Publish Date - May 05 , 2024 | 05:22 AM

ఏదైనా కారణం చేత పట్టాదారు పాసు పుస్తకం రాకపోతే... కొత్త పాసు పుస్తకం జారీ కోసం పెట్టుకునే దరఖాస్తు(డిజిటల్‌ సిగ్నేచర్‌ పెండింగ్‌)కు రుసుంను పెంచుతూ

కొత్త పాసుపుస్తకం దరఖాస్తుకు రూ.1000

డిజిటల్‌ సిగ్నేచర్‌ పెండింగ్‌కు పెరిగిన రుసుం

హైదరాబాద్‌, మే 4(ఆంధ్రజ్యోతి): ఏదైనా కారణం చేత పట్టాదారు పాసు పుస్తకం రాకపోతే... కొత్త పాసు పుస్తకం జారీ కోసం పెట్టుకునే దరఖాస్తు(డిజిటల్‌ సిగ్నేచర్‌ పెండింగ్‌)కు రుసుంను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొన్నటి వరకు కేవలం రూ.45 ఉన్న రుసుంను ఇప్పుడు ఏకంగా రూ.1000కి పెంచేసింది. అంతకుముందు ఽధరణి పోర్టల్‌లో జీఎల్‌ఎం (గ్రీవెన్స్‌ రిలేటెడ్‌ టూ ల్యాండ్‌ మ్యాటర్‌) పరిధిలో ఉన్న ఈ అంశాన్ని టీఎం-33 (టెక్నికల్‌ మాడ్యూల్‌-33) పరిధిలోకి మార్చింది. దీంతో రైతులపై అదనపు ఆర్థిక భారం పడనుంది. ధరణి పోర్టల్‌ ప్రక్షాళనలో భాగంగా టెక్నికల్‌ మాడ్యూల్‌లో ఈ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ మాడ్యూల్‌లో ఇప్పటికే 10 ఆప్షన్స్‌ ఉన్నాయి. పేరు మార్పు, భూమి స్వభావం మార్పు, భూమి వర్గీకరణ మార్పు, నాలా నుంచి వ్యవసాయానికి మార్చడం తదితర అంశాలుండేవి. తాజాగా సర్వేనెంబరు డీఎస్‌ పెండింగ్‌ ఆప్షన్‌ను కూడా ఇందులో చేర్చారు. మరోవైపు ఇదివరకే జీఎల్‌ఎంలో దరఖాస్తు చేసుకున్న వారివి ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.

Updated Date - May 05 , 2024 | 08:07 AM