Share News

MS Dhoni: ధోనీ వల్లే కోహ్లీ ఈ స్థాయిలో ఉన్నాడు.. మరోసారి విరాట్‌ను టార్గెట్ చేసిన సునీల్ గవాస్కర్

ABN , Publish Date - May 18 , 2024 | 05:36 PM

టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ, దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. కోహ్లీ భారీగా పరుగులు సాధిస్తున్నప్పటికీ స్ట్రైక్ రేట్ తక్కువగా ఉందని కొన్ని రోజుల క్రితం గవాస్కర్ విమర్శించిన విషయం తెలిసిందే.

MS Dhoni: ధోనీ వల్లే కోహ్లీ ఈ స్థాయిలో ఉన్నాడు.. మరోసారి విరాట్‌ను టార్గెట్ చేసిన సునీల్ గవాస్కర్
Virat Kohli, Sunil Gavaskar

టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli), దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. కోహ్లీ భారీగా పరుగులు సాధిస్తున్నప్పటికీ స్ట్రైక్ రేట్ తక్కువగా ఉందని కొన్ని రోజుల క్రితం గవాస్కర్ విమర్శించిన విషయం తెలిసిందే. సునీల్ వ్యాఖ్యలపై కోహ్లీ ఆగ్రహంగా స్పందించడం, దానికి మళ్లీ గవాస్కర్ కౌంటర్ ఇవ్వడం కాస్త ఉద్రిక్తతకు దారి తీశాయి. ఈ రోజు (శనివారం) బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడబోతున్నాయి (RCB vs CSK).


ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీపై సునీల్ గవాస్కర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధోనీ (MS Dhoni) లేకపోతే కోహ్లీ ఈ స్థాయిలో ఉండేవాడు కాదని అభిప్రాయపడ్డాడు. ``కెరీర్ ఆరంభంలో కోహ్లీ గొప్పగా ఆడేవాడు కాదు. ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్నట్టు ఉండేది అతడి కెరీర్. ఆ సమయంలో కోహ్లీకి ధోనీ భరోసాగా నిలిచాడు. కోహ్లీని ముందుండి నడిపించాడు. ఇప్పుడు మనం చూస్తున్న కోహ్లీ వెనుక ధోనీ ప్రోత్సాహం ఉంది`` అని గవాస్కర్ వ్యాఖ్యానించాడు.


గవాస్కర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఆగ్రహానికి కారణమవుతున్నాయి. కోహ్లీ అభిమానులు సోషల్ మీడియా ద్వారా గవాస్కర్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. కోహ్లీపై అక్కసు తగ్గించుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. గవాస్కర్ వ్యాఖ్యలపై కోహ్లీ స్పందించకపోవడమే మంచిదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కోహ్లీ ఎప్పటికీ కింగ్ అంటూ మద్దతుగా నిలుస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Virat Kohli: ధోనీ, నేను కలిసి ఆడడం ఇదే చివరి సారేమో.. విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!


Virat Kohli: రిటైర్‌మెంట్‌పై విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు.. ఒక్కసారి వీడ్కోలు పలికితే..


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 18 , 2024 | 05:36 PM