Share News

స్టేడియాలు ‘చిన్న’బోతున్నాయి

ABN , Publish Date - May 05 , 2024 | 03:17 AM

తాజా ఐపీఎల్‌లో బ్యాటర్ల హవాతో అతి భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. 250కి పైగా పరుగులను కూడా అలవోకగా బాదేస్తున్నారు. ఇలాంటి భారీ హిట్టింగ్‌పై వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆందోళన వ్యక్తం చేశాడు...

స్టేడియాలు ‘చిన్న’బోతున్నాయి

న్యూఢిల్లీ: తాజా ఐపీఎల్‌లో బ్యాటర్ల హవాతో అతి భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. 250కి పైగా పరుగులను కూడా అలవోకగా బాదేస్తున్నారు. ఇలాంటి భారీ హిట్టింగ్‌పై వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. భారీ హిట్టింగ్‌ల ఈ కారణంగా స్టేడియాల పరిమాణానికి ప్రాముఖ్యం లేకుండా పోయిందని అన్నాడు. ‘గతంలో నిర్మించిన స్టేడియాలు ప్రస్తుత ఆటతీరుకు ఏమాత్రం సరిపోవడం లేదనిపిస్తోంది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌తో గేమ్స్‌ అన్నీ ఏకపక్షంగా మారుతున్నాయి. దీంతో బౌలర్లు మానసికంగా దృఢంగా ఉండాల్సిందే. ఆట సమతూకంతో ఉంటేనే బాగుంటుంది. అయితే నైపుణ్యం కలిగిన బౌలర్‌ సవాల్‌ను స్వీకరించేందుకు సిద్ధంగానే ఉంటాడు’ అని అశ్విన్‌ తెలిపాడు.

Updated Date - May 05 , 2024 | 03:17 AM