Share News

Thailand Open ; సెమీస్‌లో సాత్విక్‌ జోడీ

ABN , Publish Date - May 18 , 2024 | 06:05 AM

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత డబుల్స్‌ జోడీలు సాత్విక్‌/చిరాగ్‌, అశ్వినీ పొన్నప్ప/తనీషా సెమీఫైనల్స్‌కు దూసుకుపోయాయి. అయితే సింగిల్స్‌లో భారత షట్లర్‌ మీరాబ పోరాటం

Thailand Open ; సెమీస్‌లో సాత్విక్‌ జోడీ

అశ్వినీ జంట కూడా

థాయ్‌లాండ్‌ ఓపెన్‌

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత డబుల్స్‌ జోడీలు సాత్విక్‌/చిరాగ్‌, అశ్వినీ పొన్నప్ప/తనీషా సెమీఫైనల్స్‌కు దూసుకుపోయాయి. అయితే సింగిల్స్‌లో భారత షట్లర్‌ మీరాబ పోరాటం క్వార్టర్స్‌తో ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో సాత్విక్‌/చిరాగ్‌ ద్వయం 21-7, 21-14తో జునైది అరీ్‌ఫ/రాయ్‌ కింగ్‌ (మలేసియా) జోడీపై గెలిచింది. మహిళల డబుల్స్‌లో అశ్వినీ/తనీషా జంట 21-15, 21-23, 21-10తో ఆరో సీడ్‌ లీ యు/షిన్‌ సుంగ్‌ (కొరియా) ద్వయంపై నెగ్గింది. పురుషుల సింగిల్స్‌ రౌండ్‌-8 మ్యాచ్‌లో మీరాబ 12-21, 5-21తో స్థానిక స్టార్‌ కున్లవత్‌ వితిద్‌శర్న్‌తో చేతిలో పరాజయం పాలయ్యాడు.

Updated Date - May 18 , 2024 | 06:05 AM