Share News

ఐపీఎల్‌ నుంచి మయాంక్‌ అవుట్‌

ABN , Publish Date - May 05 , 2024 | 03:21 AM

లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ యువ పేసర్‌ మయాంక్‌ యాదవ్‌ ఐపీఎల్‌ నుంచి వైదొలిగాడు. పొత్తి కడుపు గాయంతో అతను లీగ్‌కు దూరమయ్యాడని లఖ్‌నవూ ప్రధాన కోచ్‌...

ఐపీఎల్‌ నుంచి మయాంక్‌ అవుట్‌

న్యూఢిల్లీ: లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ యువ పేసర్‌ మయాంక్‌ యాదవ్‌ ఐపీఎల్‌ నుంచి వైదొలిగాడు. పొత్తి కడుపు గాయంతో అతను లీగ్‌కు దూరమయ్యాడని లఖ్‌నవూ ప్రధాన కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ శనివారం వెల్లడించాడు. ఈసారి ఐపీఎల్‌లో 4 మ్యాచ్‌లు ఆడిన మయాంక్‌ 7 వికెట్లు పడగొట్టాడు. అయితే రెండు మ్యాచుల్లో అతడు తన కోటా ఓవర్లను పూర్తి చేయలేకపోయాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో ఒక ఓవర్‌ వేశాక పక్కటెముకల గాయంతో తప్పుకొన్నాడు. నాలుగు వారాల పునరావాసం తర్వాత మళ్లీ జట్టులోకొచ్చాడు. అయితే, ముంబైతో మ్యాచ్‌లో తిరిగి గాయపడ్డాడు.


ఆసీస్‌ పర్యటనకు ఎంపిక..?

అత్యంత వేగవంతమైన బౌలింగ్‌తో సంచలనం సృష్టిస్తున్న మయాంక్‌ యాదవ్‌పై బీసీసీఐ దృష్టిసారించింది. 21 ఏళ్ల ఈ బౌలర్‌ను బీసీసీఐ ఇప్పటికే తన పేసర్ల కాంట్రాక్టు జాబితాలో చేర్చింది. అయితే తరచూ గాయాల బారిన పడుతున్న అతడిని ఎన్‌సీఏ లో చేర్చించి ప్రత్యేకంగా పునరావాస చర్యలు చేపట్టాలని భావిస్తోంది. గాయాల నుంచి కోలుకొని ఫిట్‌నెస్‌ సాధిస్తే జూన్‌-జూలైలో ఆస్ట్రేలియాలో పర్యటించే ఇండియా ‘ఎ’ జట్టుకు ఎంపిక చేయాలనుకుంటోంది. తద్వారా నవంబరులో ఆసీస్‌లో పర్యటించే భారత జట్టులోనూ అతడిని చేర్చాలని భావిస్తోంది.

Updated Date - May 05 , 2024 | 03:21 AM