Share News

జట్టు ఎంపికలో ‘ఏఐ’

ABN , Publish Date - May 05 , 2024 | 03:12 AM

ఎల్లలు లేని విధంగా కృత్రిమ మేథ (ఏఐ) వినియోగం పెరిగిపోతోంది. ఆటల్లోనూ ఏఐ కీలకపాత్ర పోషించే స్థితికి వచ్చింది. జట్టు ఎంపికలో ఈ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయం....

జట్టు ఎంపికలో ‘ఏఐ’

ఇంగ్లండ్‌ మహిళల క్రికెట్‌లో నూతన సాంకేతికత

లండన్‌: ఎల్లలు లేని విధంగా కృత్రిమ మేథ (ఏఐ) వినియోగం పెరిగిపోతోంది. ఆటల్లోనూ ఏఐ కీలకపాత్ర పోషించే స్థితికి వచ్చింది. జట్టు ఎంపికలో ఈ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయం తీసుకొంటున్నట్టు ఇంగ్లండ్‌ మహిళల క్రికెట్‌ జట్టు చీఫ్‌ కోచ్‌ జాన్‌ లూయిస్‌ తెలిపాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీ్‌సలో 2-1తో ఇంగ్లండ్‌ జట్టు విజయంలో ఈ నవీన సాంకేతికత ఎంతో ఉపయోగపడిందని అతను చెప్పాడు. ఒకే తరహా నైపుణ్యాలతో ఇద్దరు ప్లేయర్లు ఉండి.. వారిలో ఒకరిని మాత్రమే ఎంపిక చేయాలనుకొన్న సమయంలో ఏఐ ఎంతో సాయం చేసిందని లూయిన్‌ తెలిపాడు. ‘మనదగ్గర ఉన్న ఆటగాళ్లతో లైనప్‌ పంపితే.. పలు రకాలుగా పరీక్షించి ప్రత్యర్థి బలాలకు తగిన విధంగా ఉత్తమ జట్టును ఏఐ సూచిస్తుంద’ని లూయిస్‌ వెల్లడించాడు.

Updated Date - May 05 , 2024 | 03:12 AM