విశాఖలో పవన్ వారాహి విజయభేరీ సభ

ABN, Publish Date - May 03 , 2024 | 10:17 AM

విశాఖలో భూములు లాక్కుంటున్నారు. ధనవంతులు భయపడి అమెరికాకు వెళ్లిపోతున్నారు... ఎన్నాళ్లిలా? ఎంతమంది సొంత ఇళ్లను వదిలి వెళ్లిపోగలరు? మేం అండగా ఉంటాం. మీరు ధైర్యంగా నిలబడండి. వైసీపీని బంగాళాఖాతంలో కలిపేయండి ’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పిలుపిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జరిగిన వారాహి విజయభేరీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఉత్తరాంధ్ర, విశాఖపట్నం అంటే తనకు ప్రత్యేక అభిమానమని, ఇక్కడే నటనలో ఓనమాలు నేర్చుకున్నానని పవన్ తెలిపారు.

విశాఖలో పవన్ వారాహి విజయభేరీ సభ 1/5

విశాఖ దక్షిణ నియోజకవర్గంలో గురువారం రాత్రి వారాహి విజయభేరీ సభలో ప్రసంగించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్..

విశాఖలో పవన్ వారాహి విజయభేరీ సభ 2/5

ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పవన్ నిర్వహించిన వారాహి విజయభేరీ సభలో ప్రసంగించిన కూటమి టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్.

విశాఖలో పవన్ వారాహి విజయభేరీ సభ 3/5

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గురువారం విశాఖ దక్షిణ నియోజకవర్గంలో నిర్వహించిన వారాహి విజయభేరీ సభకు విచ్చేసిన ప్రజలకు అభివాదం తెలుపుతున్న దృశ్యం.

విశాఖలో పవన్ వారాహి విజయభేరీ సభ 4/5

విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జరిగిన వారాహి విజయభేరీ సభలో కూటమి టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ ప్రసంగాన్ని తిలకిస్తున్న జనసేనాని..

విశాఖలో పవన్ వారాహి విజయభేరీ సభ 5/5

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గురువారం విశాఖ దక్షిణ నియోజకవర్గంలో నిర్వహించిన వారాహి విజయభేరీ సభకు భారీగా తరలి వచ్చిన జనం..

Updated at - May 03 , 2024 | 10:17 AM