Share News

Madya Pradesh: భార్యతో అసహజ శృంగారం రేప్‌ కాదు..

ABN , Publish Date - May 05 , 2024 | 04:57 AM

భార్యతో అసహజ శృంగారం జరపడం అత్యాచారం కిందికి రాదని మధ్యప్రదేశ్‌ హైకోర్టు తెలిపింది. ఇందుకు ఆమె అనుమతి తీసుకున్నారా, లేదా అన్నదానితో సంబంధం లేదని పేర్కొంది.

Madya Pradesh: భార్యతో అసహజ శృంగారం రేప్‌ కాదు..

భోపాల్‌, మే 4: భార్యతో అసహజ శృంగారం జరపడం అత్యాచారం కిందికి రాదని మధ్యప్రదేశ్‌ హైకోర్టు తెలిపింది. ఇందుకు ఆమె అనుమతి తీసుకున్నారా, లేదా అన్నదానితో సంబంధం లేదని పేర్కొంది. వైవాహిక సంబంధం ఉన్నప్పుడు జరిగే అత్యాచారం నేరమేమీ కాదని న్యాయమూర్తి జస్టిస్‌ జి.ఎ్‌స.అహ్లూవాలియా తెలిపారు. భర్త అసహజ శృంగారం, అత్యాచారం చేశాడంటూ అత్తింటికి దూరంగా ఉంటున్న భార్య కేసు పెట్టింది. విచారణ జరిపిన న్యాయమూర్తి.. ఐపీసీ సెక్షన్‌ 377లోని కొన్ని అంశాలు నేర పూరిత చర్యలు కావంటూ 2018లో సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో దాన్ని ఆధారంగా చేసుకొని తాజా తీర్పును వెలువరించారు.

Updated Date - May 05 , 2024 | 04:57 AM