Share News

Reheating Oil: మూకుడులో అదే నూనెను మళ్లీ మళ్లీ వేడి చేస్తున్నారా? డేంజర్‌లో పడ్డట్టే..!

ABN , Publish Date - May 16 , 2024 | 09:16 PM

వంటనూనెలను పదే పదే వేడి చేసి వాడొద్దని భారత వైద్య పరిశోధన మండలి హెచ్చరిస్తోంది. ఇలా చేస్తే నూనెలో క్యాన్సర్ కారకాలు ఏర్పడతాయని హెచ్చరిస్తోంది.

Reheating Oil: మూకుడులో అదే నూనెను మళ్లీ మళ్లీ వేడి చేస్తున్నారా? డేంజర్‌లో పడ్డట్టే..!

ఇంటర్నెట్ డెస్క్: కొందరు పొదుపు పేరిట అదే నూనెను పదే పదే వాడుతుంటారు. ఓసారి మరిగించిన నూనెనే మళ్లీ మళ్లీ మరిగించి వాడుతారు. ఇలా చేయొద్దని భారత వైద్య పరిశోధన మండలి తాజాగా హెచ్చరించింది. ఇలా పదే పదే మరిగించడం వల్ల నూనెలో రసాయన మార్పులు వచ్చి, విషతుల్యాలు ఏర్పడతాయని ఇవి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు (Health) దారి తీస్తాయని పేర్కొంది.

నూనెను పదే పదే మరిగిస్తే (Reheating cooking Oil) అందులోని ఫ్యాటీ ఆసిడ్స్ ఆక్సిడేషన్‌కు గురై అక్రిలమైడ్, ఆల్డిహైడ్స్ వంటి విషతుల్యాలు ఏర్పడతాయి. రియాక్టివ్ ఆక్సిజన్ స్థాయిలు కూడా పెరుగుతాయి. ఇవి క్యాన్సర్ వంటివి కలుగజేస్తాయి. పదే పదే మరిగించిన నూనెలతో కొలెస్టెరాల్ కూడా పెరుగుతుంది. ఇలాంటి నూనెలతో చేసిన వంటకాలు తిన్నప్పుడు కడుపులో మంట, అరుగుదల సమస్యలు కూడా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

Mango: మామిడి కాయ, మామిడి పండు.. ఆరోగ్యానికి ఏది బెటర్?


చేయాల్సింది ఇదే..

సాధారణంగా ఓసారి వేపుళ్లకు వాడిన నూనెను మళ్లీ వాడొద్దనే వైద్యులు చెబుతున్నారు. తప్పదనుకుంటే వాటిని వేడిచేయకుండా కూరలు, వంటివాటి తయారీకి వాడొచ్చని అంటున్నారు. ఒసారి వాడిన నూనెను ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా ఒకటి రెండు రోజుల్లోనే వాడేయాలని కూడా చెబుతున్నారు.

పాలీ అన్సాట్యురేటెడ్ ఫాట్యీయాసిడ్స్ ఎక్కువగా ఉన్న నూనెలనే వాడాలి. ఆయిల్ ఆక్సిడేషన్ కు గురికాకుండా ఉండేందుకు వాటిని చల్లని వాతావరణంలో ఉంచాలి. వీలైనంత వరకూ ఇంట్లో వండిన వంటకాలనే తినాలి.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 16 , 2024 | 09:21 PM