Share News

Dinner Facts: రాత్రి భోజనంలో కాల్షియం అధికంగా తీసుకుంటే గుండె జబ్బులు వస్తాయా? ఇందులో నిజమెంతంటే..!

ABN , Publish Date - May 04 , 2024 | 03:13 PM

కాల్షియం శరీరానికి చాలా అవసరం. కానీ రాత్రి భోజనంలో కాల్షియం అధికంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వస్తాయని అంటారు. అసలు ఇందులో నిజమెంతుందో తెలుసుకుంటే..

Dinner Facts: రాత్రి భోజనంలో కాల్షియం అధికంగా తీసుకుంటే గుండె జబ్బులు వస్తాయా? ఇందులో నిజమెంతంటే..!

ఆహారం ప్రతి మనిషికి తప్పనిసరి. తీసుకునే ఆహారమే మనిషి శరీరానికి ఔషదంగా పనిచేస్తుంది, ఆహారం సరిగా లేకపోతే అది వికటించి విషంగా కూడా మారుతుంది. అయితే ఒక్కోసారి ఆరోగ్యకరమైన ఆహారం అయినా సరైన సమయంలో తీసుకోకపోతే అది శరీరానికి ప్రమాదం కలిగిస్తుంది. అలాంటిదే రాత్రి భోజనంలో కాల్షియం అధికంగా తీసుకోవడం. కాల్షియం శరీరానికి చాలా అవసరం. కానీ రాత్రి భోజనంలో కాల్షియం అధికంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వస్తాయని అంటారు. అసలు ఇందులో నిజమెంతుందో తెలుసుకుంటే..

గుండె ఆరోగ్యం పై కాల్షియం అధికంగా ఉన్న ఆహారాల ప్రభావం ఉంటుందని అంటారు. శరీరానికి కాల్షియం ఎంతో అవసరం. ఎముకల ఆరోగ్యం, కండరాల పనితీరు, నరాల పనితీరు, రక్తం గడ్డ కట్టడం మొదలైన విధులలో కాల్షియం కీలకపాత్ర పోషిస్తుంది. ఆహారంలో పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు మొదలైనవి గుండె ఆరోగ్యాన్ని సేఫ్ గా ఉంచడంలో సహాయపడతాయి. ఇవి మాత్రమే కాకుండా శారీరక శ్రమ చేయాలి. ధూమపానం, మద్యపానం మొదలైనవి అవాయిడ్ చేయడం వల్ల కూడా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

వేయించిన శనగలు తినడం వల్ల కలిగే ప్రయోజానాల గురించి తెలుసా?


శరీర సామర్థ్యం, వయసు, జెండర్, హార్మోన్ల స్థితి.. ఇవి మాత్రమే కాకుండా రోజులో తీసుకునే ఆహారంలో కాల్షియం పరిమాణాన్ని బట్టి రాత్రి పూట కాల్షియం ఆధారిత ఆహారాలు తీసుకోవడం ఎంత వరకు సేఫ్ అనే విషయాన్ని నిర్థారించవచ్చు. శరీర అవసరాలకు మించి కాల్షియం అందించకుండా తగిన మొత్తంలో శరీరానికి అందేలా చూడాలి. రోజు మొత్తం కాల్షియం ఆధారిత ఆహారాలు తీసుకోవడం మంచిది కాదు. ఇక రాత్రి భోజనంలో కాల్షియం ఆధారిత ఆహారాలను మాత్రమే తీసుకోకుండా సంపూర్ణ ఆహారాన్ని డిన్నర్ లో భాగం చేసుకోవడం మంచిది. ఇలా చేస్తే శరీరానికి ఇతర పోషకాలు అందుతాయి. ఎక్కువ కాల్షియం పేరుకుపోకుండా ఉంటుంది.

రోజూ పాలతో చేసిన టీ తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఇవే..!

వేయించిన శనగలు తినడం వల్ల కలిగే ప్రయోజానాల గురించి తెలుసా?

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 04 , 2024 | 03:13 PM