Share News

Health Tips: మామిడి పండ్లు తింటున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి.. లేదంటే వెరీ డేంజర్..!

ABN , Publish Date - May 05 , 2024 | 10:17 AM

అసలే మామిడి పండ్ల కాలం.. చూడగానే నోరూరతుంది. మ్యాంగో తినాలని ఎవరికి ఉండదు. మామిడిపండ్లు రుచికరమైనవి మాత్రమే కాదు.. పోషకాలతో కూడి ఉంటాయి. వీటిలో విటమిన్ ఎ, సి, ఇ, అలాగే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే మామిడి పండ్లలో జీర్ణక్రియ, పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహించే ఎంజైమ్‌లు ఉంటాయి. అయినప్పటికీ మామిడి పండ్లు తింటే షుగర్ లెవల్స్ పెరగడంతో పాటు.. బరువు పెరుగుతారనే ఆందోళన చాలామందిలో కనిపిస్తుంది.

Health Tips: మామిడి పండ్లు తింటున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి.. లేదంటే వెరీ డేంజర్..!
Mangoes

అసలే మామిడి పండ్ల కాలం.. చూడగానే నోరూరతుంది. మ్యాంగో తినాలని ఎవరికి ఉండదు. మామిడిపండ్లు రుచికరమైనవి మాత్రమే కాదు.. పోషకాలతో కూడి ఉంటాయి. వీటిలో విటమిన్ ఎ, సి, ఇ, అలాగే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే మామిడి పండ్లలో జీర్ణక్రియ, పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహించే ఎంజైమ్‌లు ఉంటాయి. అయినప్పటికీ మామిడి పండ్లు తింటే షుగర్ లెవల్స్ పెరగడంతో పాటు.. బరువు పెరుగుతారనే ఆందోళన చాలామందిలో కనిపిస్తుంది. అసలు మామిడి పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయా.. చేటు చేస్తాయా అనే అనుమానాలు చాలా మందిలో ఉంటాయి. అసలు మామిడి పండుతో కలిగే లాభ, నష్టాల గురించి తెలుసుకుందాం.


మామిడి పండ్లలో చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి దారితీయవచ్చు. మధుమేహం ఉన్నవారు మామిడి పండ్లు పరిమితంగా తీసుకోవాల్సి ఉంటుంది. వేసవి కాలంలో తియ్యని మామిడి పండ్లు ఎక్కువుగా లభిస్తాయి.. దీంతో మామిడిని డైట్ లో ఉన్నవాళ్లు తినకూడదనీ, వాళ్లు తింటే మళ్లీ బరువు పెరుగుతారని ఒక అపోహ ఉంది. కానీ మామిడి పండ్లను తీసుకోవడం వల్ల విటమిన్ ఎ, సి, ఇ లభిస్తాయి.

Health Tips: ఎక్కువ సమయం ల్యాప్టాప్ ముందు కూర్చుని లేదా నిలబడి గడుపుతున్నారా? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలివీ..!


మామిడి పండ్లతో ప్రయోజనాలు..

మ్యాంగో రుచికరమైనవి మాత్రమే కాకుండా అవసరమైన పోషకాలతో కూడి ఉంటాయి. రోగనిరోధకశక్తి పెరగడానికి, చర్మ రక్షణకు తోడ్పడతాయి. వేసవిలో చర్మ సమస్యలు ఎక్కువగా వస్తాయి. వాటిని తగ్గించడానికి మామిడి పండ్లు ఉపయోగపడతాయి. ఈ పండ్లలో జీర్ణక్రియకు సహాయపడే డైటరీ ఫైబర్, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడే పొటాషియం ఉన్నాయి. మామిడి పండ్లను తీసుకుంటే బరువు పెరుగుతారా అనే విషయానికి వస్తే.. నిజానికి మామిడిలో 150 కేలరీలు ఉంటాయి. చక్కెర కంటెంట్ కారణంగా బరువు పెరగడానికి దోహదం చేస్తుందని చాలామంది నమ్ముతారు. కొన్ని భాగాల పరిమాణాలపై జాగ్రత్త అవసరం. ప్రత్యేకించి మీరు మీ క్యాలరీలను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, ఇతర పండ్లతో పోలిస్తే మామిడిలో కేలరీలు తక్కువగా ఉంటాయి.. అందుకే తక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. అతిగా తీసుకోవడం మంచిది కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


Dinner Facts: రాత్రి భోజనంలో కాల్షియం అధికంగా తీసుకుంటే గుండె జబ్బులు వస్తాయా? ఇందులో నిజమెంతంటే..!

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 05 , 2024 | 10:17 AM