Share News

జెన్‌ టెక్నాలజీస్‌ డివిడెండ్‌ 100 శాతం

ABN , Publish Date - May 05 , 2024 | 06:04 AM

జెన్‌ టెక్నాలజీస్‌.. గడచిన ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికానికి గాను కంపెనీ స్టాండ్‌ఎలోన్‌...

జెన్‌ టెక్నాలజీస్‌ డివిడెండ్‌ 100 శాతం

క్యూ 4 లాభం రూ.33 కోట్లు

హైదరాబాద్‌: జెన్‌ టెక్నాలజీస్‌.. గడచిన ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికానికి గాను కంపెనీ స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన రూ.138.04 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.33.03 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.74.33 కోట్ల ఆదాయంపై రూ.17.21 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. కాగా మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను కంపె నీ రూ.444.20 కోట్ల ఆదాయంపై రూ.129.23 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో రూ.1 ముఖ విలువ ప్రతి షేరుకు రూ.1 డివిడెండ్‌ (100 శాతం)ను బోర్డు సిఫారసు చేసింది. కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆమోదం పొందిన తర్వాత 30 రోజుల్లో ఈ డివిడెండ్‌ను చెల్లించనున్నట్లు తెలిపింది. కాగా మార్చి ముగిసే నాటికి చేతిలో రూ.1,401.97 కోట్ల ఆర్డర్లు ఉన్నట్లు జెన్‌ టెక్నాలజీస్‌ వెల్లడించింది.

Updated Date - May 05 , 2024 | 06:04 AM