Share News

సాక్షులను లేపేద్దాం!

ABN , Publish Date - May 05 , 2024 | 04:16 AM

ఏదైనా నేరం జరగ్గానే నేరం చేసిన వాళ్లు సాక్ష్యాధారాలు చెరిపేయడానికి ప్రయత్నిస్తారు. ముందస్తు ప్లాన్‌తో నేరం చేసే వాళ్లు, సాక్ష్యాలు లేకుండా చేయాలని చూస్తారు.

సాక్షులను  లేపేద్దాం!

జనం ఆస్తులు కొట్టేసే ప్లాన్‌లో తదుపరి వ్యూహమా?

ఇకపై సాక్షులు లేకుండానే రిజిస్ర్టేషన్లు

ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం.. రెడీగా ఉత్తర్వులు

పోలింగ్‌ పూర్తవగానే అమలుకు సన్నాహాలు పూర్తి!

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఏదైనా నేరం జరగ్గానే నేరం చేసిన వాళ్లు సాక్ష్యాధారాలు చెరిపేయడానికి ప్రయత్నిస్తారు. ముందస్తు ప్లాన్‌తో నేరం చేసే వాళ్లు, సాక్ష్యాలు లేకుండా చేయాలని చూస్తారు. ఈ రెండు సందర్భాలూ జగన్‌ సర్కార్‌కు అతికినట్టు సరిపోతా యి. ప్రజల ఆస్తులపై కన్నేసిన జగన్‌ సర్కారు, వాటిని కొట్టేయడానికి ప్లానేసి, ఈ నేరానికి ఎలాంటి సాక్ష్యాలు మిగలకుం డా జాగ్రత్తలు తీసుకుంటోంది. జనాల ఆస్తులను వివాదాల్లోకి నెట్టడానికి ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం తెచ్చింది. జనాల ఆస్తుల కు సంబంధించిన ఒరిజినల్‌ డాక్యుమెంట్లు ఇవ్వడం లేదు. అత్యంత కీలకమైన వేలిముద్రల రిజిస్టర్‌ను ఎత్తేశారు. ఇక మిగిలింది సాక్షులు. ఏదైనా రిజిస్ర్టేషన్‌ జరిగితే ఇద్దరు సాక్షు లు తప్పనిసరిగా ఆ డాక్యుమెంట్లపై సంతకాలు చేయాలి. జగన్‌ సర్కారు భవిష్యత్తులో సమస్యగా మారుతారు అనుకు న్న సాక్షులను ఇప్పుడు పూర్తిగా ఎత్తేయాలని నిర్ణయించారు. ఇకపై రిజిస్ర్టేషన్లన్నీ సాక్షులు లేకుండానే జరుగుతాయి. ప్రస్తు తం జిరాక్సు విధానంలో అమ్మేవారు, కొనేవారు ఇద్దరూ రిజిస్ర్టేషన్‌ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్తున్నా రు. సాక్షులు కూడా ఉండరు. ఎవరు ఎవరికి ఎన్నిసార్లు అ మ్మారో ఎవరికీ తెలిసే అవకాశం లేదు. రిజిస్ర్టేషన్ల ప్రక్రియలో సాక్షులను ఎత్తేస్తూ తెచ్చిన ప్రతిపాదన ఫైలు ఐజీ కార్యాలయంలో అందరి ఆమోదం పొందింది. ఎన్నికలు పూర్తయ్యాక ఉత్తర్వులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.

ఇప్పటికే ఆస్తులు రిజిస్ర్టేషన్‌ చేసుకున్న వారి వేలిముద్రలు, ఆస్తిపత్రాలను క్రిటికల్‌ రివర్‌ అనే ప్రైవేటు కంపెనీకి మళ్లిస్తున్నారు. స్టాంపులు, రిజిస్ర్టేషన్ల చట్టం ప్రకారం ప్రతి రిజిస్ర్టేషన్‌కు ఇద్దరు సాక్షులుండాలి. రిజిస్ర్టేషన్‌ కోసం ఆధార్‌, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్సు, పాన్‌కార్డు వాడేవారు. ఇప్పుడు జగన్‌ తెచ్చిన జిరాక్స్‌ రిజిస్ర్టేషన్ల విధానంలో కేవలం ఆధార్‌ కార్డు ఒక్కదాన్నే తప్పనిసరి చేశారు. ఇన్ని డాక్యుమెంట్లున్నప్పటికీ కూడా ఇద్దరు వ్యక్తుల మధ్య ఆస్తుల కొనుగోలు, అమ్మకాలు జరుగుతుంటే సాక్షులు తప్పకుండా ఉండాలన్న నిబంధనను చట్టంలో పెట్టారు. ఎం దుకంటే ఆధార్‌ సహా అన్ని డాక్యుమెంట్లు నకిలీవి వస్తున్నా యి. కానీ, ఆ అమ్మేవారు, కొనేవారు ఇద్దరూ నకిలీ కాదని, వా రిద్దరు తమకు తెలుసని మరో ఇద్దరు వ్యక్తులు ఒప్పుకొంటూ పెట్టే సాక్షి సంతకాలు అవి. అలాంటి కీలకమైన ఘట్టాన్ని రిజిస్ర్టేషన్ల ప్రక్రియ నుంచి జగన్‌ సర్కారు తొలగిస్తోంది. ప్రజల ఆస్తులకు సంబంధించిన అంశం కాబట్టి పకడ్బందీగా స్టాంపు లు, రిజిస్ర్టేషన్ల చట్టాన్ని ఏర్పాటు చేశారు. కానీ, ఇప్పుడు ఏదైనా భూమి/ఆస్తి రిజిస్ర్టేషన్‌పై వివాదం తలెత్తి కోర్టు వర కు వెళ్తే కోర్టు ఎలా పరిష్కరిస్తుంది? ముందుగా ఒరిజినల్‌ డాక్యుమెంట్లు ఉండవు. రిజిస్ర్టేషన్‌ జరిగినట్టు సాక్షులు ఉండ రు. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో వేలిముద్రల రిజిస్టర్లు ఎత్తేశారు. అందువల్ల కోర్టుకు సమర్పించడానికి ప్రభుత్వం తరపున అది కూడా ఉండదు. ఈ స్థితిలో ఆస్తుల వివాదాలు ఎలా పరిష్కారమవుతాయి? ఇలా వీటన్నింటిని వివాదాల్లోకి నెట్టి ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం ద్వారా కొట్టేయాలన్నదే జగన్‌ సర్కార్‌ లక్ష్యంగా కనిపిస్తోంది.


క్రిటికల్‌ రివర్‌ ‘మన’ కంపెనీయే..

జిరాక్సు రిజిస్ర్టేషన్ల కోసం జగన్‌ సర్కారు కొత్తగా రంగంలో కి దించిన ప్రైవేటు కంపెనీ క్రిటికల్‌ రివర్‌ ప్రభుత్వ పెద్దలకు సన్నిహిత కంపెనీయే. పేరుకు ఈ కంపెనీ అమెరికాలో రిజిస్టర్‌ అయింది. కానీ, ఈ కంపెనీ వ్యవస్థాపకులు, డైరెక్టర్లు అం దరూ తెలుగువారే. ఇండియాలో ఓ బ్రాంచ్‌ పెట్టారు. ఈ సం స్థ వ్యవస్థాపకుడు అంజిరెడ్డి మారం.. జగన్‌ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా ఉన్న పాతూరి శేషిరెడ్డికి సన్నిహితుడు. ఒకప్పుడు శేషిరెడ్డి.. క్రిటికల్‌ రివర్‌ కంపెనీలో భాగస్వామిగా ఉండేవారు. అలాగే, బోర్డులో ఉన్న రాజురెడ్డి కూడా ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులే. అందుకే ఏరికోరి ఈ కంపెనీని ఎంచుకుని, ప్రజల ఆస్తుల వివరాలను, వారి వేలిముద్రలను ఈ కంపెనీకి మళ్తిస్తున్నారు. రాష్ట్రంలో స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖకు కేంద్రం పరిధిలోని ఎన్‌ఐసీ టెక్నికల్‌ సేవలు అందించేది. ఈ సేవలకు గాను ప్రభుత్వం ఎన్‌ఐసీకి ఏడాదికి రూ.12 కోట్లు చెల్లిస్తుంది. కానీ, అకస్మాత్తుగా ఎన్‌ఐసీని తప్పించారు. రూ.35 కోట్లు సమర్పించి క్రిటికల్‌ రివర్‌ని రంగంలోకి దించింది. ఒకవేళ ఎన్‌ఐసీ సేవలు కొనసాగిస్తే.... జనాల ఆస్తులను కొట్టేయడం కష్టం అవుతుందని భావించినట్టుంది.

నకిలీ రిజిస్ర్టేషన్ల ముప్పు

వేలిముద్రల తొడుగులతో చాలా నేరాలు జరుగుతున్నాయి. ప్రజల ఖాతాల్లోని డబ్బులు దోచేస్తున్నారు. అలాంటిది, రాష్ట్ర ప్రజల వేలిముద్రలు ఏదో ప్రైవేటు కంపెనీకి చేరవేస్తే ప్రజల ఆస్తుల కు, ఖాతాలో డబ్బులకు రక్షణ ఉంటుందా? ఆ వేలిముద్రలు ఉపయోగించుకుని నకిలీ రిజిస్ర్టేష న్లు జరగవని గ్యారంటీ ఏముంది? ఏదైనా భూ వివాదం తలెత్తి కోర్టు వరకు వెళ్తే సాక్ష్యం కింద చూపించడానికి వేలిముద్రల రిజిస్టరే ఉండదు. పైగా సాక్షులు కూడా ఉండరు.

Updated Date - May 05 , 2024 | 04:23 AM