Share News

AP Elections 2024: వైసీపీ ప్రలోభాలు షురూ.. ఓట్ల కొనుగోళ్లకు నోట్ల కట్టలు తరలింపు

ABN , Publish Date - May 04 , 2024 | 07:05 PM

ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ నేతలు ఏం చేస్తారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఓట్లను కొనుగోలు చేసేందుకు డబ్బులను పంపిణీ చేయడం, మద్యపానం సరఫరా చేయడం వంటివి చేస్తారు.

AP Elections 2024: వైసీపీ ప్రలోభాలు షురూ.. ఓట్ల కొనుగోళ్లకు నోట్ల కట్టలు తరలింపు

ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ నేతలు ఏం చేస్తారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఓట్లను కొనుగోలు చేసేందుకు డబ్బులను పంపిణీ చేయడం, మద్యపానం సరఫరా చేయడం వంటివి చేస్తారు. అందరూ కాదు కానీ, అధికారాన్ని ఎలాగైనా పొందాలనుకునే నేతలు మాత్రం.. ఇటువంటి అడ్డదారులు తొక్కుతుంటారు. ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ (YCP) అదే పనికి పాల్పడుతున్నట్టు తేలింది. కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలో.. ఓట్ల కొనుగోళ్లకు వైసీపీ నేతల ఇళ్లకు భారీ మొత్తంలో పచ్చ నోట్ల కట్టలు చేరుతున్నాయి. వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు (Perni Kittu) తండ్రి, ఎమ్మెల్యే పేర్ని నాని (Perni Nani) పంపిన నోట్లతో.. వైసీపీ కార్పొరేటర్ తిరుమలశెట్టి వరప్రసాద్ (Tirumalasetti Varaprasad) కెమెరాకు చిక్కారు.


హార్దిక్ పాండ్యాకు షాక్.. అతడి స్థానంలో ఆ క్రికెటర్‌ను..

తన కుమారుడిని అడ్డదారుల్లో అందలమెక్కించేందుకు.. పేర్ని నాని ఇప్పటికే ప్రజలను అనేక ప్రలోభాలకు గురి చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ ముందు, ఆ తర్వాత పెద్ద ఎత్తున ఫేక్ నివేశన స్థలాలను పంపిణీ చేశారు. అయితే.. ఈ విషయంలో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. ఒక వీఆర్‌ఓపై అధికారులు ఓటు వేశారు. అయినా పేర్ని నాని వెనక్కు తగ్గకుండా.. తప్పుడు మార్గాలను ఎంపిక చేసుకుంటున్నారు. ఇప్పుడు నోట్లతో ఓట్లు కొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు.. తన చర్యలతో ప్రశాంతంగా ఉన్న మచిలీపట్నంలో రాజకీయ ఘర్షణలకు దారి తీస్తున్నారు. మూడు రోజుల క్రితం 8వ డివిజన్‌లో జనసేన నేత కర్రి మహేష్ ఇంట్లోకి చొరబడి.. పేర్ని కిట్టు, ఆయన అనుచరులు దాడి చేశారు. ఈ కేసులో పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదైనా, పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం.

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - May 04 , 2024 | 07:05 PM