Share News

AP Elections: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ వెనుక వైసీపీ కుట్ర.. బయటపెట్టిన టీడీపీ నేత..

ABN , Publish Date - May 05 , 2024 | 12:44 PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం కొద్ది రోజులుగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చుట్టూ తిరుగుతోంది. ప్రజల భూములు లాక్కునేందుకు వైసీపీ ఈ చట్టాన్ని తీసుకొచ్చిందంటూ టీడీపీ, జనసే, బీజేపీ కూటమి నేతలతో పాటు.. ప్రజాసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎన్నికల ప్రచారంలో ప్రధానపాత్ర పోషిస్తోంది. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే పేద ప్రజల భూములకు రక్షణ ఉండదనే విమర్శలు వస్తున్నాయి. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై వివాదం నడుస్తున్న వేళ.. ఈ చట్టానికి సంబంధించిన అనేక అంశాలు బయటకు వస్తున్నాయి. ఈ చట్టంలో సంబంధించిన పలు అంశాలు అనుమానస్పందగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

AP Elections: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ వెనుక వైసీపీ కుట్ర.. బయటపెట్టిన టీడీపీ నేత..

ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం కొద్ది రోజులుగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చుట్టూ తిరుగుతోంది. ప్రజల భూములు లాక్కునేందుకు వైసీపీ ఈ చట్టాన్ని తీసుకొచ్చిందంటూ టీడీపీ, జనసే, బీజేపీ కూటమి నేతలతో పాటు.. ప్రజాసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎన్నికల ప్రచారంలో ప్రధానపాత్ర పోషిస్తోంది. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే పేద ప్రజల భూములకు రక్షణ ఉండదనే విమర్శలు వస్తున్నాయి. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై వివాదం నడుస్తున్న వేళ.. ఈ చట్టానికి సంబంధించిన అనేక అంశాలు బయటకు వస్తున్నాయి. ఈ చట్టంలో సంబంధించిన పలు అంశాలు అనుమానస్పందగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రజల భూములకు రక్షణ కల్పిస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ చట్టాన్ని వైసీపీ సమర్థించుకుంటోంది.


ఈ చట్టం ద్వారా ఎవరి భూములకు ఎలాంటి ఢోకా ఉండబోదని అంటున్నారు. అయినా ఈ చట్టంలో పలు అంశాలను చూసిన తర్వాత ప్రజలకు అనేక అనుమానాలు కలుగుతున్నాయని రాజకీయ, ప్రజాసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఈ చట్టానికి సంబంధించి రూపొందించిన పలు అంశాలు వైసీపీ దురుద్దేశాన్ని తెలియజేస్తు్ందంటూ టీడీపీ జాతీయ అధికారప్రతినిధి జి వెంకట్‌రెడ్డి ట్వీట్ చేశారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దుర్మార్గమైనదని, ప్రజల భూములను వాళ్లనుంచి లాక్కోవడానికి ఈ చట్టం తెచ్చారంటూ టీడీపీ నాయకులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఓ కొత్త అంశాన్ని వెంకట్‌రెడ్డి తెరమీదకు తెచ్చారు.

CM Ramesh: వైసీపీ దౌర్జన్యాలకు భయపడేది లేదు..


కుట్ర ఇదేనంటూ..

తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జి వెంకటరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌లో సెక్షన్ 5కి సంబంధించిన అంశాలను ఆయన ట్వీట్ చేశారు. సెక్షన్ 5 ఆఫ్ ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ 2022 ప్రకారం రాష్ట్రప్రభుత్వానికి ఏ వ్యక్తికైనా టైట్లింగ్ రిజిస్ట్రేషన్ అధికారిగా నియమించుకునే అధికారం ఉందన్నారు. రాష్ట్రప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అధికారిని నియమించుకోవచ్చని.. ఆయన ఈ చట్టానికి సంబంధించిన తీర్పులను ఇచ్చే అధికారం సెక్షన్5 కల్పిస్తుందని.. దీనిని బట్టి వైసీపీ చెడు ఉద్దేశం అర్థమవుతుందన్నారు. వైసీపీ తమకు నచ్చిన వ్యక్తిని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అధికారిగా నియమించుకుని వారికి నచ్చినట్లు తీర్పులు ఇప్పించుకునేందుకు ఈ చట్టాన్ని ప్రజలపై రుద్దుతున్నారని విమర్శించారు.


Sujana Choudary: వైసీపీ తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest AP News and Telugu News

Updated Date - May 05 , 2024 | 12:44 PM