Share News

tdp: ఆదరించండి.. అభివృద్ధి చేస్తా

ABN , Publish Date - May 05 , 2024 | 01:13 AM

కదిరిఅర్బన, మే 4: ఎన్నికల్లో ఆదరించాలని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్‌ ప్రజల్ని కోరారు. రూరల్‌ పరిధిలోని వీరుపల్లిపేట, ఎట్టిగడ్డతండా, పట్నం, మాచిరెడ్డిపల్లి, కాళసముద్రం గ్రామాల్లో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం విస్తృతంగా చేపట్టారు. గ్రామాలప్రజలు, స్థానిక నాయకులు బాణసంచా కాల్చి, పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు. తర్వాత ఆయన ఇంటింటికీ వెళ్లి సైకిల్‌ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ ఎన్నికల్లో ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. రుణం తీర్చుకుంటానని తెలిపారు. నియోజవకర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు. గ్రామాల్లో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

అలాగే ఎంపీగా బీకే పార్థసారధిని గెలిపించాలని అన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాల ప్రయోజనాల గురించి వివరించారు. చంద్రబాబు సీఎం అవగానే వాటిని అమలు చేస్తారని చెప్పారు. ఒక్కఛాన్స పేరుతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన గడిచిన ఐదేళ్లలో రాష్ర్టాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. జగన పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. ఈఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైసీపీ నాయకులు అడ్డదారులు తొక్కేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ఈవిషయన్ని ప్రజలు గమనించాలని సూచించారు. కార్యక్రమంలో మండలకన్వీనర్‌ చెన్నకేశవులు, నాయకులు హరి, ఉపేంద్రరెడ్డి, ప్రతా్‌పరెడ్డి, ప్రసాద్‌, చంద్రశేఖర్‌, రవికుమార్‌, రాజశేఖర్‌, అంజి, బీజేపీ ఎర్రమశెట్టి రమే్‌షబాబు, చలపతి, జనసేన నాయకులు కొట్టు అశ్వర్థకుమార్‌, చిల్లా మహేష్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 05 , 2024 | 01:13 AM