బ్లూ టీతో అద్భుత లాభాలు..  ఆ సమస్యలన్నీ మాయం

బ్లూ టీ.. దీనిని శంఖుపుష్పాలతో తయారు చేస్తారు. నీలం రంగులో ఉండే ఈ టీ.. శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది.

ఈ టీలోని యాంటీఆక్సిడెంట్లు.. శరీరంలో ఆరోగ్యకరమైన కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి.

ఖాళీ కడుపుతో వారినికోసారి ఈ టీ తాగితే.. ఎసిడిటీ, మలబద్ధకం, గ్యాస్‌, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దూరం అవుతాయి.

ఈ బ్లూ టీలో కెఫిన్‌, కార్బోహైడ్రేట్స్‌, కొవ్వులు, కొలెస్ట్రాల్‌ ఉండవు. ఇది ఆకలిని నియంత్రించి.. బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.

రోజూ బ్లూ టీ తాగితే.. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్‌తో పాటు ఇతర పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నివారిస్తుంది.

బ్లూ టీలోని ఆరోగ్యకరమైన సమ్మేళనాలు.. హానికరమైన ట్రైగ్లిజరైడ్, చెడు కొలెస్ట్రాల్‌‌ని తగ్గించి.. గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయి.

శంఖుపుష్పాలలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, అనాల్జేసిక్ లక్షణాలు.. కంటి ఇన్ఫెక్షన్లతో పాటు వాపు వంటి సమస్యలను తగ్గిస్తాయి.

బ్లూ టీలో ఉండే ఆంథోసైనిన్ అణువులు.. కడుపులో మంటని తగ్గించడంతో పాటు క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా నిరోధిస్తాయి.

శంఖుపుష్పాల్లోని ఎసిటైల్కోలిన్ సమ్మేళనం ‘అల్జీమర్స్‌’తో పోరాడటానికి సహాయపడుతుంది. ఈ టీ తాగితే మెదడు రీఫ్రెష్ అవుతుంది.