Share News

TG: అమెరికాలో తెలంగాణ విద్యార్థి అదృశ్యం

ABN , Publish Date - May 10 , 2024 | 05:35 AM

న్నత విద్య కోసం తెలంగాణ నుంచి అమెరికా వెళ్లిన ఓ విద్యార్థి కనిపించకుండా పోయాడు. హనుమకొండ నయీంనగర్‌కు చెందిన చింతకింది రూపేశ్‌ చంద్ర(26) షికాగోలో అదృశ్యమయ్యాడు.

TG: అమెరికాలో తెలంగాణ విద్యార్థి అదృశ్యం

హైదరాబాద్‌, వరంగల్‌ క్రైం, మే9 (ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్య కోసం తెలంగాణ నుంచి అమెరికా వెళ్లిన ఓ విద్యార్థి కనిపించకుండా పోయాడు. హనుమకొండ నయీంనగర్‌కు చెందిన చింతకింది రూపేశ్‌ చంద్ర(26) షికాగోలో అదృశ్యమయ్యాడు. విస్కాన్సి్‌సలోని కాంకార్డియా వర్సిటీలో మాస్టర్స్‌ చదువుతున్న రూపేశ్‌ ఆచూకీ వారం రోజులుగా తెలియడం లేదని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.


రూపేశ్‌తో మే 2న చివరిగా మాట్లాడామని, మరుసటి రోజు ఫోన్‌ చేయగా మొబైల్‌ స్విచ్‌ ఆఫ్‌ వచ్చిందని సదానందం తెలిపారు. రెండ్రోజులు వేరే స్నేహితుడి వద్దకు వెళుతున్నానని రూపేశ్‌ చెప్పినట్లు అతని రూమ్‌మేట్స్‌ తెలిపారని వివరించారు. వారంరోజులైనా కొడుకు ఆచూకీ తెలియకపోవడంతో అమెరికాలోని తానా సభ్యుల సహకారంతో కుటుంబసభ్యులు షికాగో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అలాగే, సాయం కోరుతూ కలెక్టర్‌, స్థానిక ప్రజాప్రతినిధులు కలిశారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి కూడా లేఖ రాశారు. కాగా, మెకానిక్‌ అయిన సదానందం రెండో కుమారుడైన రూపేశ్‌ ఎంఎస్‌ చేసేందుకు 2019లో లండన్‌ వెళ్లాడు. 2022లో స్వదేశానికి వచ్చిన రూపేశ్‌ డబుల్‌ ఎంఎస్‌ చేసేందుకు 2023 డిసెంబరులో అమెరికా వెళ్లాడు.


మే2 నుంచి రూపేశ్‌ ఆచూకీ కోసం ప్రవాస భారతీయులతో సంప్రదింపులు జరుపుతున్నామని షికాగోలోని భారత రాయబార కార్యాలయం, అక్కడి పోలీసులు వేర్వేరు ప్రకటన లు చేశారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు అధికమవుతున్న నేపథ్యంలో రూపేశ్‌ తల్లిదండ్రులు సదానందం, ఉమ తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Updated Date - May 10 , 2024 | 05:35 AM