Share News

మూడేళ్లలో ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేస్తాం

ABN , Publish Date - May 01 , 2024 | 11:51 PM

ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులను మూడేళ్లలో పూర్తిచేస్తామని, పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు ఓటువేస్తే మూసీలో వేసినట్లేనని, రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండలో పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా నిర్వహించిన నియోజకవర్గ బూత్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

మూడేళ్లలో ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేస్తాం

నల్లగొండ నియోజకవర్గంలో వాలంటీర్ల వ్యవస్థ

బీఆర్‌ఎ్‌సకు ఓటు వేస్తే మూసీలో వేసినట్టే

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్లగొండ, మే 1: ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులను మూడేళ్లలో పూర్తిచేస్తామని, పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు ఓటువేస్తే మూసీలో వేసినట్లేనని, రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండలో పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా నిర్వహించిన నియోజకవర్గ బూత్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు తన నియోజకవర్గం నల్లగొండలో ఎంత మెజార్టీ వస్తుందనే ది ప్రతీ ఒక్కరు చర్చించుకుంటున్నందున అందరి కంటే ఎక్కువగా నల్లగొండ నియోజకవర్గంలో మెజార్టీ ఇచ్చి తన మాట నిలబెట్టాలన్నారు. నల్లగొండ నియోజకవర్గం నుంచి 75వేల నుంచి లక్ష ఓట్ల మెజార్టీని కట్టబెట్టి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రభు త్వం బాధ్యతలు చేపట్టినప్పుడు రూ.3,900కోట్ల లోటుతో ఉందని, గత ప్రభుత్వం రూ.7లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. నల్లగొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో జూన్‌ 2 నుంచి ప్రతీక్‌ ఫౌండేషన్‌ వాలంటీర్ల వ్యవస్థను తీసుకువస్తానని, వారి ద్వారానే ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందే లా ప్రణాళికను సిద్ధం చేశానన్నారు. వారికి నెల కు రూ.10వేల జీతం ఫౌం డేషన్‌ ద్వారా చెల్లిస్తానన్నారు. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్లలో చేసింది ఏమి లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు శ్రీశై లం సొరంగ మార్గాన్ని 30కిలోమీటర్లు పూర్తి చేస్తే బీఆర్‌ఎస్‌ 10కిలోమీటర్లు కూడా పూర్తి చేయలేదన్నారు. ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి మాట్లాడుతూ, పార్లమెంటు ఎన్నికల్లో తమ గెలుపు ప్రతీ ఒక్కరి గెలుపు అన్నారు. కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షు డు శంకర్‌నాయక్‌, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌, ఎన్నికల ఇన్‌చార్జి నిరంజన్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ బుర్రి శ్రీనివా్‌సరెడ్డి, వైస్‌ చైర్మన్‌ అబ్బగోని రమే్‌షగౌడ్‌, జడ్పీటీసీలు పాశం రాంరెడ్డి, వంగూరి లక్ష్మ య్య, నాయకులు సుమన్‌, కొండేటి మల్లయ్య, గుత్తా జితేందర్‌రెడ్డి, గుత్తా అమిత్‌రెడ్డి, విజయలక్ష్మి, జూకూరి రమేష్‌, బొడ్డుపల్లి లక్ష్మి, గోపగాని మాధవి, పాశం సంపత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2024 | 11:52 PM