Share News

సమాజికాన్ని పట్టేందుకు

ABN , Publish Date - May 01 , 2024 | 11:49 PM

లోక్‌సభ సమరం వేడెక్కుతున్న కొద్దీ అభ్యర్థులు, పార్టీల నాయకులు సామాజిక సమీకరణాలపై దృష్టి సారించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు లోక్‌సభ స్థానాల్లో ఎక్కడ ఏ వర్గం ఏ రకమైన ప్రభావాన్ని చూపగలుగుతుందనే అంచనాల్లో ఆయా పార్టీల నేతలు, వ్యూహకర్తలు మునిగితేలుతున్నారు.

సమాజికాన్ని పట్టేందుకు

ఓటు బ్యాంకు కలిగిన వర్గాలకు దగ్గరయ్యే వ్యూహాలు

పట్టణాల్లో ఉద్యోగ, నిరుద్యోగ, ప్రొఫెషనల్స్‌, వృత్తిదారులపై దృష్టి

ఆయా వర్గాలకు గాలం వేస్తున్న ప్రధాన పార్టీలు

ప్రత్యేకంగా సమ్మేళనాలతో ఆకట్టుకునే యత్నాలు

నల్లగొండ, మే 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): లోక్‌సభ సమరం వేడెక్కుతున్న కొద్దీ అభ్యర్థులు, పార్టీల నాయకులు సామాజిక సమీకరణాలపై దృష్టి సారించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు లోక్‌సభ స్థానాల్లో ఎక్కడ ఏ వర్గం ఏ రకమైన ప్రభావాన్ని చూపగలుగుతుందనే అంచనాల్లో ఆయా పార్టీల నేతలు, వ్యూహకర్తలు మునిగితేలుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజికవర్గాల మద్దతుకు ప్రయత్నిస్తున్న పార్టీలు, పట్ట ణ ప్రాంతాలకు వచ్చేసరికి కార్మిక, ఉద్యోగ, నిరుద్యోగ, విద్యార్థి వర్గాలతో పాటు, ప్రొఫెషనల్స్‌, ఉపాధ్యాయుల మద్దతు కోరుతున్నారు. ఓ వైపు ర్యాలీలు, రోడ్‌షోలతో ప్ర చారం సాగిస్తూనే, మరోవైపు ఆయా వర్గాల సమ్మేళనాలు, గెట్‌ టుగెదర్‌లకు హాజరవుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.

ఓటు బ్యాంకు ఉన్న సామాజికవర్గాలపై కన్ను

ఉమ్మడి జిల్లాలో రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో వేర్వే రు సమీకరణాలు తెరమీదకు వచ్చాయి. నల్లగొండ లోక్‌సభ స్థానంలో గ్రామీణ ప్రాంతాల్లో రైతులతో పాటు అత్యధిక ఓటర్లు కలిగిన లంబాడ (ఎస్టీ), యాదవ్‌ (బీసీ) సా మాజికవర్గాలతో పాటు దళిత సామాజికవర్గ ఓట్లపై ప్రధా న పార్టీల అభ్యర్థులు, నేతలు దృష్టి సారించారు. ఈ రెండువర్గాల్లో అత్యధిక ఓటుని సాధిస్తే గెలుపునకు దగ్గరిదారి ఏర ్పడుతుందనే అంచనాతో నేతలు కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో బరిలో ఉన్న ప్రఽధానపార్టీల అభ్యర్థులు కుందూరు రఘువీర్‌రెడ్డి (కాంగ్రెస్‌), కంచర్ల కృష్ణారెడ్డి (బీఆర్‌ఎస్‌), శానంపూడి సైదిరెడ్డి (బీజే పీ) ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావడంతో ఎక్కు వ ఓట్లున్న సామాజికవర్గాలపై దృష్టి సారించారు. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో చామల కిరణ్‌కుమార్‌రెడ్డి (కాం గ్రెస్‌) ఓసీ, డాక్టర్‌ బూరనర్సయ్యగౌడ్‌ (బీజేపీ), క్యామమల్లేశ్‌ (బీఆర్‌ఎస్‌) బీసీ, ఎండీ.జహంగీర్‌ (సీపీఎం) మైనార్టీ వర్గానికి చెందిన వారు. నియోజకవర్గంలో అత్యధిక ఓటిం గ్‌ ఉన్న గౌడలతోపాటు, గొల్ల, కురుమ, పద్మశాలి, ముదిరా జ్‌ తదితర బీసీ సామాజికవర్గాలు, దళిత సామాజికవర్గం ఓట్లపై మూడు పార్టీలు ప్రధానంగా దృష్టి సారించాయి. ఈ వర్గాల నుంచి అత్యధిక ఓట్లు తెచ్చుకోవడం ద్వారా గెలుపును అందుకోవాలనే ప్రయత్నాలను ఆ పార్టీలు ము మ్మరం చేశాయి. ఈ వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అసెంబ్లీ నియోజకవర్గస్థాయిల్లో ముఖ్యులతో సమావేశాలు, సమ్మేళనాలు నిర్వహిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నా రు. ఈ వర్గాలతో పాటు తక్కువ ఓటు బ్యాంకున్నప్పటికీ ఐక్యంగా ఓటింగ్‌కి అవకాశమున్న మరికొన్ని బీసీ వర్గాలు, మైనార్టీ ఓటర్లపై కూడా దృష్టిసారించారు. పార్టీలు, అభ్యర్థుల తరఫున ఈ వర్గాలకు చెందిన కీలకనేతలు, జిల్లా, రాష్ట్రస్థాయి బాధ్యతల్లో ఉన్న నేతలు ఓటర్లను సమీకరించే పనిలో పడ్డారు.

పట్టణ ప్రాంత ఓటర్లకు గాలం

గ్రామీణ ప్రాంతాల్లో సామాజికవర్గాల వారీగా ఓటర్ల ను ప్రసన్నంచేసుకునే కార్యాచరణ అమలు చేస్తున్న పార్టీలు పట్టణ ప్రాంతాల్లో అందుకు భిన్నమైన రీతిలో ఓటర్లను సమీకరించే పనిలో పడ్డాయి. ప్రధానంగా పట్టణాల్లో నివసించే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికు లు, నిరుద్యోగులు, విద్యార్థులు, ప్రొఫెషనల్స్‌, వృత్తిపనివాళ్లను తమవైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆయా పార్టీల ఎజెండాలతో పాటు వ్యక్తిగతం తమకు మద్దతు ఇస్తే అన్ని విధాలా అండగా ఉంటామనే హామీ తో సమావేశాలు నిర్వహిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌లో ఎక్కువగా పాల్గొనే ఈ వర్గాలను ప్రసన్నం చేసుకోవడం ద్వారా ఓట్లను పెంచుకోవచ్చని ఆయా పార్టీలు భావిస్తున్నాయి. జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయాల ప్రభావం సైతం ఈ వర్గాలపై ఉంటుండడంతో మద్దతు సంపాదిస్తే విజయానికి దగ్గరిదారి ఉంటుందని ఆయా పార్టీలు వ్యూహాలను అమలుచేస్తున్నాయి.

Updated Date - May 01 , 2024 | 11:49 PM