Share News

సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శం

ABN , Publish Date - May 02 , 2024 | 12:02 AM

దక్షిణభారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య, జీవితం నేటి తరానికి ఆదర్శం అని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నారి ఐలయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మాటూరి బాలరాజు అన్నారు.

 సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శం

వలిగొండ, మే 1: దక్షిణభారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య, జీవితం నేటి తరానికి ఆదర్శం అని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నారి ఐలయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మాటూరి బాలరాజు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో సుందరయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూస్వామ్య కుటుంబంలో పుట్టి పెరిగిన పుచ్చలపల్లి సుందరయ్య పేదప్రజలు, వ్యవసాయ కూలీలు, కార్మికుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. ఎంపీగా ఉండి సైకిల్‌పై పార్లమెంట్‌కు వెళ్లి రాజకీయాల్లో అందరికీ ఆదర్శంగా నిలిచిన గొప్ప మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు మద్దెల రాజయ్య, సిరిపంగి స్వామి, కూర శ్రీనివాస్‌, రామ్‌చందర్‌, వెంకట్‌రెడ్డి, సురేష్‌, నర్సింహ, భిక్షపతి, నాగరాజు, యాదగిరి పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2024 | 12:02 AM