Share News

బీరప్ప కల్యాణంలో ప్రజాప్రతినిధులు, అభ్యర్థులు

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:41 AM

భువనగిరి మండలంలోని అనంతారంలో బీరప్ప కామరాతి కల్యాణోత్సవం సోమవారం అంగరంగా వైభవంగా నిర్వహించారు.

బీరప్ప కల్యాణంలో ప్రజాప్రతినిధులు, అభ్యర్థులు

భువనగిరి రూరల్‌, ఏప్రిల్‌ 29: భువనగిరి మండలంలోని అనంతారంలో బీరప్ప కామరాతి కల్యాణోత్సవం సోమవారం అంగరంగా వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. భువనగిరి పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ బూర నర్సయ్య, బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశం, జడ్పీ చైర్మన ఎలిమినేటి సందీ్‌పరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, భిక్షమయ్యగౌడ్‌, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి జడ్పీటిసీ బీరుమల్లయ్య పల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2024 | 08:20 AM