Share News

పిల్లల నడవడికలో తల్లిదండ్రులే కీలకం

ABN , Publish Date - May 01 , 2024 | 11:08 PM

పిల్లల నడవడికలో తల్లిదండ్రులదే ప్రధాన భూమిక అని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పీ శ్రీవాణి అన్నారు.

పిల్లల నడవడికలో తల్లిదండ్రులే కీలకం
న్యాయ విజ్ఞానసదస్సులో మాట్లాడుతున్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీవాణి

సూర్యాపేట లీగల్‌, మే 1 : పిల్లల నడవడికలో తల్లిదండ్రులదే ప్రధాన భూమిక అని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పీ శ్రీవాణి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌నగర్‌లో మేడే సందర్భంగా నిర్వహించిన న్యాయవిజ్ఞాన శిబిరంలో ఆమె మాట్లాడారు. పిల్లలను సన్మార్గంలో పెంచాల్సిన ప్రధాన బాధ్యత తల్లిదండ్రులదే అన్నారు. స్కూల్‌లో ఉపాధ్యాయులు కూడా పిల్లలపై వ్యక్తిగత శ్రద్ధ వహిస్తు విద్యార్థుల దృష్టి ఇతర విషయాలపైకి మళ్లకుండా చదువుపైనే కొనసాగించేలా చూడాలన్నారు. డ్రగ్స్‌, గంజాయి వంటి మత్తుపదార్థాల బారిన పడకుండా పెంచినప్పుడే రేపటి సమాజంలో పిల్లలు వెలుగులు నింపుతారన్నారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన అధ్యక్షుడు నూకల సుదర్శనరెడ్డి, ప్రధాన కార్యదర్శి డప్పు మల్లయ్య, వసంత సత్యనారాయణపిళ్లే, పట్టణ సీఐ జీ రాజశేఖర్‌ ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.

విధుల్లో చేరిన మొదటి జిల్లా అదనపు జడ్జి

రాష్ట్ర హైకోర్టు సాధారణ పరిపాలన బదిలీలో భాగంగా మొదటి జిల్లా అదనపు న్యాయమూర్తిగా డాక్టర్‌. ఎం.శ్యాంశ్రీ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేసే జిల్లా అదనపు జడ్జిగా పనిచేస్తున్న అమరావతి బదిలీపై వెళ్లగా, ఆమె స్థానంలో కొత్తగూడెం జిల్లాలో మొదటి జిల్లా అదనపు జడ్జిగా పనిచేస్తున్న శ్యాంశ్రీ బదిలీపై వచ్చారు.

Updated Date - May 01 , 2024 | 11:08 PM