Share News

పదిలో బాలికలదే హవా

ABN , Publish Date - May 01 , 2024 | 12:32 AM

ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన పదోతరగతి పరీ క్ష ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలో బాలికలు సత్తా చాటారు. బాలురు 93.95శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 96.24శాతంతో ముందంజలో ఉన్నారు.

పదిలో బాలికలదే హవా

ఉమ్మడి జిల్లాలో 96.24శాతంతో ముందంజ

మొత్తంగా 95.06శాతం ఉత్తీర్ణత

రాష్ట్రస్థాయిలో సూర్యాపేటకు 6, నల్లగొండకు 9, యాదాద్రికి 25వ స్థానం

(ఆంధ్రజ్యోతి,యాదాద్రి)/ కోదాడ, నల్లగొండ, భానుపురి: ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన పదోతరగతి పరీ క్ష ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలో బాలికలు సత్తా చాటారు. బాలురు 93.95శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 96.24శాతంతో ముందంజలో ఉన్నారు. మొ త్తంగా ఉమ్మడి జిల్లా విద్యార్థులు 95.06శాతం ఉత్తీర్ణ త సాధించారు. ప్రశ్నపత్రాల రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు మే 1 నుంచి 15వ తేదీ వరకు అవకాశం కల్పించారు. అందుకు ప్రధానోపాధ్యాయులకు ఫీజు చెల్లించి దరఖా స్తు చేసుకోవాలని విద్యాశాఖ వెల్లడించింది. ఫెయిల్‌ అయిన విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా మే 16వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. రూ.50 అపరాధ రుసుముతో ప్రతీ పరీక్షకు రెండు రోజుల ముం దు వరకు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉం దని అధికారులు తెలిపారు. అడ్వాన్డ్స్‌ సప్లమెంటరీ పరీక్ష లు జూన్‌ 3 నుంచిజూన్‌ 13వతేదీ వరకు ఉదయం 9.30 నుంచి 12.30గంటల వరకు నిర్వహించనున్నారు.

ఉమ్మడి జిల్లాలో గత నెల 18వ తేదీ నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించగా, మొత్తం 40,281మంది విద్యార్థులు పరీక్ష రాశారు. వారిలో 38,292 మంది ఉతీర్ణత సాధించారు. నల్లగొండ జిల్లాలో మొత్తం 19,263మంది పరీక్ష రాయగా, 18,513మంది (96.11శాతం) ఉత్తీర్ణ సాధించారు. బాలురు 10,099 మంది పరీక్ష రాయ గా, 9,615మంది (95.21శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 9,164 మంది పరీక్షకు హాజరు కాగా, 8,898 మంది (97.10శాతం) ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో పలు మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన 231 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 13మంది విద్యార్థులు 10జీపీఏ సాధించారు. ఒక ఎయిడెడ్‌ పాఠశాల, ఒక ఆశ్రమ పాఠశాల, 13 బీసీ వెల్ఫేర్‌, మూడు ప్రభుత్వ పాఠశాలలు, 10 కేజీబీవీ, నాలుగు మోడల్‌ స్కూ ల్‌లు, 97 ప్రైవేట్‌ పాఠశాలలు, నాలుగు ఆర్‌ఈఎస్‌, 8 సోష ల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, ఆరు ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, 84 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు నూరుశాతం ఫలితాలు సాధించాయి. శాలిగౌరారం మండలం పెర్కకొండారం జిల్లా పరిషత్‌ ఉన్నత పా ఠశాలలో ఇద్దరికి,చిట్యాల మండలంలోని నేరడ జడ్పీ ఉన్న త పాఠశాలలో ఇద్దరికి, మిర్యాలగూడటౌన్‌లోని బకాల్‌వాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఒకరికి, బాలికల ఉన్నత పా ఠశాలలో మరొకరికి 10జీపీఏ వచ్చింది.తిరుమలగిరి సాగర్‌ మండలంలోని తిరుమలగిరిలో జడ్పీ హైస్కూల్‌లో ఒకరు, మిర్యాలగూడ మండలం ఆలగడపలో ఒకరు, అనుముల మండలంలోని జడ్పీ హైస్కూల్‌లో ఒకరు, ఇదే మండలంలోని మారేపల్లిలో ఒకరికి, కనగల్‌ మండలంలోని వెంకటేశ్వర్‌రావు మెమోరియల్‌ స్కూల్‌లో ఒకరికి 10జీపీఏ వచ్చిం ది. జిల్లా రాష్ట్రస్థాయిలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.

సూర్యాపేట జిల్లాలో మొత్తం 11,910మంది పరీక్ష రా యగా, 11,542మంది (96.91శాతం) ఉత్తీర్ణ సాధించారు. బాలురు 6,198మంది పరీక్ష రాయగా, 5,960మంది (96.16 శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 5,712 మంది పరీక్షకు హాజరు కాగా, 5,582 మంది (97.72శాతం) ఉత్తీర్ణత సాధించారు. జిల్లా గత ఏడాది రాష్ట్రస్థాయిలో 15వ స్థానం లో ఉండగా, ఈ ఏడాది ఆరో స్థానంలో నిలిచింది. జిల్లాలో 196 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఎయిడెడ్‌ పాఠశాలలు మూడు, మరో పాఠశాల, ఒక ఆశ్రమ పాఠశాల, ఆరు బీసీ వెల్ఫేర్‌, ఏడు కేజీబీవీ, మూడు మోడల్‌ స్కూల్స్‌, 97 ప్రైవేట్‌ పాఠశాలలు, ఒక రెసిడెన్షియల్‌, నాలుగు మైనార్టీ రెసిడెన్షియల్‌, ఆరు సోషల్‌ వెల్ఫేర్‌, 80 జడ్పీ పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి.

యాదాద్రి జిల్లాలో మొత్తం 9,108మంది పరీక్ష రాయగా, 8,237మంది (91.01శాతం) ఉత్తీర్ణ సాధించారు. బాలురు 4,571 మంది పరీక్ష రాయగా, 4,032మంది (88.21శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 4,537 మంది పరీక్షకు హాజరు కాగా, 4,205 మంది (92.68శాతం) ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో మొత్తం 68మంది 10జీపీఏ సాధించారు. అందులో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు 31మంది ఉన్నారు. 75 పాఠశాలలు నూరుశాతం ఉత్తీర్ణత సాధించగా, అందులో 39ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. గత ఏడాది జిల్లాలో 80.97శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈ సారి 9.5శాతం అధికంగా ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రస్థాయిలో జిల్లాకు 25వ స్థానం దక్కింది.

జిల్లాల వారీగా ఉత్తీర్ణత శాతం ఇలా..

జిల్లా బాలురు ఉత్తీర్ణత శాతం బాలికలు ఉత్తీర్ణత శాతం మొత్తం ఉత్తీర్ణత శాతం

నల్లగొండ 10,099 9,615 95.21 9,164 8,898 97.10 19,263 18,513 96.11

సూర్యాపేట 6,198 5,960 96.16 5,712 5,582 97.72 11,910 11,542 96.91

యాదాద్రి 4,571 4,032 88.21 4,537 4,205 92.68 9,108 8,237 91.01

మొత్తం 20,868 19,607 93.95 19,413 18,685 96.24 40,281 38,292 95.06

Updated Date - May 01 , 2024 | 12:32 AM