Share News

ధాన్యంలో కోతపై అధికారి విచారణ

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:39 AM

మోత్కూరు మార్కెట్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించగా, రైస్‌ మిల్లు యజమానులు తూకంలో కోత పెడుతున్నారని, బస్తాల ఎగుమతికి లారీ డ్రైవర్లు బస్తాకు రూ.3 చొప్పున అడుగుతున్నారని, హమాలీలు, చాట మహిళలు తమ ఇష్టానుసారం ధాన్యం తీసుకుంటున్నారని రైతు అవిశెట్టి కిరణ్‌కుమార్‌తో పాటు పలువురు ఆదివారం పత్రికల ద్వారా వెలుగులోకి తెచ్చారు.

ధాన్యంలో కోతపై అధికారి విచారణ

మోత్కూరు, ఏప్రిల్‌ 29: మోత్కూరు మార్కెట్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించగా, రైస్‌ మిల్లు యజమానులు తూకంలో కోత పెడుతున్నారని, బస్తాల ఎగుమతికి లారీ డ్రైవర్లు బస్తాకు రూ.3 చొప్పున అడుగుతున్నారని, హమాలీలు, చాట మహిళలు తమ ఇష్టానుసారం ధాన్యం తీసుకుంటున్నారని రైతు అవిశెట్టి కిరణ్‌కుమార్‌తో పాటు పలువురు ఆదివారం పత్రికల ద్వారా వెలుగులోకి తెచ్చారు. ఈ నేసథ్యలో జిల్లా పౌరసరఫరాల శాఖ ఆలేరు ఆర్‌ఐ హరిశ్చంద్రారెడ్డిని విచారణాధికారిగా నియమించింది. ఆయన సోమవారం మోత్కూరు మార్కెట్‌కు వెళ్లి విచారణ జరిపారు. కిరణ్‌కుమార్‌ ధాన్యం తూకం వేసిన తర్వాత మిల్లుకు పంపడంలో నాలుగు రోజులు జాప్యం జరిగిందని, దీంతో ఎండ తీవ్రతకు ధాన్యం తూకం తగ్గడంతో ఆత్మకూరు శివసాయి మల్లికార్జున రైస్‌ మిల్లు యజమాని తూకం తగ్గించారని, ధాన్యం కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరుగలేదని ఆయన నివేదిక ఇచ్చినట్టు జిల్లా పౌరసరఫరాల కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా విచారణాధికారి విలేకరులకు విషయాలు చెప్పిన తననుగాని, ఇతర రైతులను గాని విచారించలేదని రైతు అవిశెట్టి కిరణ్‌ తెలిపారు.

Updated Date - Apr 30 , 2024 | 08:27 AM