Share News

స్వయం ఉపాధితో ఆదాయ మార్గాలు పెంపొందించుకోవాలి

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:40 AM

గ్రామీణ ప్రాంతాల్లో స్వయంఉపాధి ద్వారా ఆదా య మార్గాలు పెంపొందించుకోవాలని హైదరాబాద్‌లోని నేషనల్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌ (ఎన్‌ఐఆర్‌డీ)లో రూరల్‌ డెవల్‌పమెంట్‌ కోర్సులో శిక్షణ పొందుతున్న వివిధ రాష్ట్రాల విద్యార్థుల బృందం సూచించింది.

స్వయం ఉపాధితో ఆదాయ మార్గాలు పెంపొందించుకోవాలి

భూదాన్‌పోచంపల్లి, ఏప్రిల్‌ 29 : గ్రామీణ ప్రాంతాల్లో స్వయంఉపాధి ద్వారా ఆదా య మార్గాలు పెంపొందించుకోవాలని హైదరాబాద్‌లోని నేషనల్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌ (ఎన్‌ఐఆర్‌డీ)లో రూరల్‌ డెవల్‌పమెంట్‌ కోర్సులో శిక్షణ పొందుతున్న వివిధ రాష్ట్రాల విద్యార్థుల బృందం సూచించింది. సోమవారం భూదాన్‌పోచంపల్లిలోని సహకార సంఘా న్ని 35 మంది విద్యార్థులు సందర్శించారు. అనంతరం చేనేత మగ్గాలను చేనేత కార్మికుల గృహాలను, మగ్గంపై చేనేత వస్త్ర తయారీతో పాటు వస్త్ర తయారీ ప్రక్రియలను పరిశీలించారు. కార్మికుల జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. చేనేత కార్మికులు రూపొందించిన కళాత్మక డిజైన్లతో రూపొందించిన చీరలను పరిశీలించి కార్మికుల ప్రతిభను ప్రశంసించారు. స్థానిక వస్త్ర దుకాణదారులను కలిసి వారి వ్యాపార నిర్వహణను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ దేవప్రియ, ఫ్యాకల్టీ హైమావ తి, ప్రాజెక్టు అసిస్టెంట్‌ మాధవ, పోచంపల్లి చేనేత సహకార సంఘం మేనేజర్‌ రుద్ర ఆంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2024 | 12:40 AM