Share News

నెల రోజులు పోలీస్‌ యాక్టు అమలు

ABN , Publish Date - May 01 , 2024 | 11:06 PM

జిల్లాలో శాంతిభద్రతలు దృష్టిలో పెట్టుకుని ఈ నెల 30వ తేదీ వరకు 30, 30(ఏ) పోలీస్‌యాక్టు- 1861 అమల్లో ఉంటుందని ఎస్పీ రాహుల్‌హెగ్డే బుఽధవారం తెలిపారు.

నెల రోజులు పోలీస్‌ యాక్టు అమలు

సూర్యాపేటక్రైం, మే 1: జిల్లాలో శాంతిభద్రతలు దృష్టిలో పెట్టుకుని ఈ నెల 30వ తేదీ వరకు 30, 30(ఏ) పోలీస్‌యాక్టు- 1861 అమల్లో ఉంటుందని ఎస్పీ రాహుల్‌హెగ్డే బుఽధవారం తెలిపారు. పోలీస్‌అధికారుల ముందస్తు అనుమతి లేనిది ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాస్తారోకోలు, ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్‌మీటింగ్‌లు, సభలు సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగేలా ప్రజాధనానికి నష్టం కలిగించే చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేపట్టవద్దన్నారు.

విద్యార్థికి మెరిట్‌ స్కాలర్‌షిప్‌ అందజేత

జిల్లా హోంగార్డు శాఖలో విధులు నిర్వహిస్తున్న ఆంజనేయచారి కుమారుడు నితినసాయి పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచడంతో ఎస్పీ రాహుల్‌హెగ్డే పోలీ్‌సశాఖ మెరిట్‌స్కాలర్‌షిప్‌ చెక్కును అందజేశారు. అంతకుముందు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ప్రిన్సిపల్‌ జిల్లా న్యాయుమూర్తి గోవర్థనరెడ్డిని మర్యాదపూర్వకంగా ఎస్పీ కలిసి పుష్టగుచ్ఛం అందజేశారు. ఆయన వెంట ఆర్‌ఐ నర్సింహ, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2024 | 11:06 PM