Share News

రేపు చండూరు, నల్లగొండలో హరీ్‌షరావు రోడ్‌షో

ABN , Publish Date - May 01 , 2024 | 11:54 PM

మాజీ మంత్రి హరీ్‌షరావు ఈనెల 3వ తేదీన నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నట్టు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తెలిపారు. హరీ్‌షరావు పాల్గొనే సభాస్థలిని ఆయన బుధవారం సాయంత్రం పరిశీలించారు.

రేపు చండూరు, నల్లగొండలో హరీ్‌షరావు రోడ్‌షో

నల్లగొండ, మే 1: మాజీ మంత్రి హరీ్‌షరావు ఈనెల 3వ తేదీన నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నట్టు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తెలిపారు. హరీ్‌షరావు పాల్గొనే సభాస్థలిని ఆయన బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, శుక్రవారం సాయంత్రం 5గంటలకు చండూరులో, 6గంటలకు నల్లగొండలోని వివేకానంద విగ్రహం నుంచి రోడ్‌షో ప్రారంభించి గడియారం సెంటర్‌లో కార్నర్‌ మీటింగ్‌ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌, ఒంటెద్దు నర్సింహారెడ్డి, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, జమాల్‌ఖాద్రీ, తదితరులు ఉన్నారు.

Updated Date - May 01 , 2024 | 11:54 PM