Share News

పోచంపల్లి బ్యాంకుకు మరో ఐదు నూతన శాఖలు

ABN , Publish Date - May 01 , 2024 | 11:55 PM

ది పోచంపల్లి కో-ఆపరేటివ్‌ అర్బన బ్యాంకు నూతనంగా మరో ఐదు శాఖలకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతి మంజూరు చేసిందని బ్యాంకు చైర్మన కర్నాటి వెంకట బాలసుబ్రహ్మణ్యం, సీఈవో సీత శ్రీనివాస్‌ తెలిపారు.

 పోచంపల్లి బ్యాంకుకు మరో ఐదు నూతన శాఖలు

భూదానపోచంపల్లి, మే 1 : ది పోచంపల్లి కో-ఆపరేటివ్‌ అర్బన బ్యాంకు నూతనంగా మరో ఐదు శాఖలకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతి మంజూరు చేసిందని బ్యాంకు చైర్మన కర్నాటి వెంకట బాలసుబ్రహ్మణ్యం, సీఈవో సీత శ్రీనివాస్‌ తెలిపారు. బుధవారం పట్టణంలోని బ్యాంకు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో తొమ్మిది శాఖలతో 357 కోట్ల వ్యాపారం, రూ. 2.57 కోట్ల నికర లాభంతో ముందుకు దూసుకెళ్తున్న పోచంపల్లి అర్బన బ్యాంకుకు ఇబ్రహీంపట్నం, ఆమనగల్‌, కల్వకుర్తి, తుర్క ఎంజాల్‌, కొండమల్లేపల్లి పట్టణాల్లో నూతన బ్రాంచలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి లభించిందన్నారు. ఖాతాదారులకు అత్యున్నత సాంకేతికతతో కూడిన సేవలు అందిస్తూ ప్రతి ఏటా ఉత్తమ అర్బన బ్యాంకు అవార్డులను కైవసం చేసుకుంటూ అభివృద్ధిలో ముందుకు సాగుతుందన్నారు. సమావేశంలో అర్బన బ్యాంకు వైస్‌చైర్మన సూరపల్లి రమేష్‌, డైరెక్టర్లు సీత దామోదర్‌, బోగ విజయ్‌కుమార్‌, చిక్క కృష్ణ, పున్న లక్ష్మీనారాయణ, కొండమడుగు ఎల్లస్వామి, కడవేరు కవిత, పిల్లలమర్రి అర్చన, రాపోలు వేణు, బిట్ల భాస్కర్‌, మేనేజర్‌ రాచకొండ మధుసూదన, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2024 | 11:55 PM