Share News

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ABN , Publish Date - May 02 , 2024 | 12:06 AM

మండల పరిధిలోని వంకమామిడి గ్రామంలో జడ్పీహెచఎ్‌సలోని 2008-09 పదో తరగతి బ్యాచకు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం బుధవారం ఘనంగా నిర్వహించారు.

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

భూదానపోచంపల్లి, మే 1: మండల పరిధిలోని వంకమామిడి గ్రామంలో జడ్పీహెచఎ్‌సలోని 2008-09 పదో తరగతి బ్యాచకు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు చెప్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆటపాటలతో విద్యార్థులు ఉల్లాసంగా గడిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు దామోదర్‌రెడ్డి, సత్తయ్య, వెంకటేశ్వర్లచారి, విద్యార్థులు కాసుల చందు, ప్రియాంక, మమత, సతీష్‌, శంకర్‌, పరమేశ్వరి, శిరీష, మహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2024 | 12:06 AM