Share News

బీఆర్‌ఎస్‌, కాంగ్రె్‌సకు ఓటేస్తే ఫలితం శూన్యం: రఘునందన్‌రావు

ABN , Publish Date - May 01 , 2024 | 11:24 PM

నారాయణరావుపేట/సిద్దిపేట రూరల్‌/చిన్నకోడూరు, మే 1: పదేళ్లు పాలించిన బీఆర్‌ఎ్‌సకు, కొత్తగా ఏర్పడిన కాంగ్రె్‌సకు ఓటేస్తే ఫలితం శూన్యంగా మారుతుందని బీజేపీ మెదక్‌ అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు.

బీఆర్‌ఎస్‌, కాంగ్రె్‌సకు ఓటేస్తే ఫలితం శూన్యం: రఘునందన్‌రావు
ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు

నారాయణరావుపేట/సిద్దిపేట రూరల్‌/చిన్నకోడూరు, మే 1: పదేళ్లు పాలించిన బీఆర్‌ఎ్‌సకు, కొత్తగా ఏర్పడిన కాంగ్రె్‌సకు ఓటేస్తే ఫలితం శూన్యంగా మారుతుందని బీజేపీ మెదక్‌ అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు. బుధవారం నారాయణరావుపేటలో నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్నారు. సిద్దిపేట రూరల్‌ మండలం పూల్లురు, రాఘవాపూర్‌, పెద్దలింగారెడ్డిపల్లి మీదుగా మండల కేంద్రం వరకు బైక్‌ ర్యాలీతో కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ర్యాలీ మధ్యలో పెద్దలింగారెడ్డిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు, హమాలీలతో మాట్లాడి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం నారాయణరావుపేట మండలంలోని బస్టాండ్‌ చౌరస్తా వద్ద రఘునందన్‌రావు మాట్లాడారు. నారాయణరావుపేట పేరుకే మండలంలో ఏర్పడిందని, ఇప్పటివరకు ఎలాంటి ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవన్నారు. మాజీ ఆర్థికమంత్రిగా ఉన్న హరీశ్‌రావు పదేళ్లు కలెక్టర్‌గా పనిచేసిన వెంకట్రామారెడ్డి వెంట తిరగాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే కోమటిచెరువులో, నారాయణరావుపేట పెద్ద చెరువులో వేసినట్లేనన్నారు. అనంతరం మాటిండ్ల గోపులాపూర్‌, జక్కాపూర్‌, గుర్రాలగొంది, మల్యాల, మీదుగా రోడ్‌షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్‌రెడ్డి, మండలాధ్యక్షుడు పొన్నాల బాబు, జిల్లా అధికార ప్రతినిధి రమే్‌షగౌడ్‌, బీజేపీ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. అలాగే చిన్నకోడూరులో బుధవారం రాత్రి నిర్వహించిన రోడ్‌షోలో రఘునందన్‌రావు పాల్గొని మాట్లాడారు.

Updated Date - May 01 , 2024 | 11:24 PM