Share News

కార్మిక విజయానికి సంకేతం మేడే

ABN , Publish Date - May 01 , 2024 | 11:13 PM

కార్మికలోకం సాగించిన ఐక్య పోరాటాలతో దక్కిన ఫలితానికి మేడే ప్రతి రూపమని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయలు అన్నారు.

కార్మిక విజయానికి సంకేతం మేడే
గద్వాల బస్టాండ్‌ వద్ద జెండావిష్కరణలో పాల్గొన్న ఏఐటీయూసీ నాయకులు

- ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు

- జిల్లా వ్యాప్తంగా ఘనంగా మేడే ఉత్సవాలు

- ఊరూరా రెపరెపలాడిన ఎర్రజెండా

గద్వాల టౌన్‌/ గద్వాల అర్బన్‌/ గద్వాల న్యూటౌన్‌/ వడ్డేపల్లి/ అయిజ/ ధరూరు/ గట్టు/ ఉండవల్లి/ మల్దకల్‌/ కేటీదొడ్డి/ మే 1 : కార్మికలోకం సాగించిన ఐక్య పోరాటాలతో దక్కిన ఫలితానికి మేడే ప్రతి రూపమని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయలు అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని నల్లకుంట కార్మిక సంఘం ఆవరణలో ఏఐ టీయూసీ జెండాను ఎగురవేశారు. కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, న్యాయవాది మధుసూదన్‌బాబు కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మి కులు ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న 44 చట్టాలను మోదీ ప్రభుత్వం తొలగించి తీరని ద్రోహం చేసిందన్నారు. మేడే స్ఫూర్తితో ఐక్యపోరాటాలు సాగించి బీజేపీ ప్రభు త్వానికి గుణపాఠం నేర్పాలని, హక్కుల పునరుద్ధరణ కోసం మేడే స్పూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు వెంకటస్వామి, ఆశన్న, కాశీం, కృష్ణ, ప్రవీణ్‌ పాల్గొన్నారు.

- ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని గద్వాల పట్టణంలోని పాతబస్టాండ్‌ సర్కిల్‌లో మునిసి పల్‌, హమాలీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే ఉత్సవాల్లో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పేరు నరసింహ సంఘం జెండాను ఎగురవేశారు. కార్య క్రమంలో సీఐటీయూ, అనుబంధ సంఘాల నాయ కులు రామకృష్ణ, బాలు, రంగన్న, గట్టన్న, రాజేష్‌, గోపి, వెంకటేష్‌, సీతారం, వీరన్న ఉన్నారు.

- ఐఎఫ్‌టీయూ నాయకులు పట్టణంలోని గంజిపేట, జమ్మిచేడు, వెంకటంపల్లిలో ఎర్ర జెండాలను ఎగురవేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో కార్తీక్‌, మదు, అంజి, రంగస్వామి, రాజు, మన్యం, గోపాల్‌, ఆంజనేయులు, ఇమ్మానుయేల్‌, తిమ్మన్న, వంశీ, రాకేష్‌, వెంకటేష్‌, శషాంత్‌, రాము, సంజీవులు పాల్గొన్నారు.

కార్మికుల శ్రమను గౌరవిద్దాం

హక్కుల సాధనకు పోరాడిన కార్మికుల శ్రమను గౌరవిద్దామని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయు లు అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరిం చుకుని ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కార్యనిర్వాహక అధ్యక్షుడు పరమేశ్వరయ్య యూనియన్‌ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయు లు, కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, న్యాయవాది మధుసూదన్‌బాబు, మధు బాబు, ఆర్టీసీ రిటైర్ట్‌ ఉద్యోగి టీఆర్‌ఎస్‌ గౌడ్‌ హాజర య్యారు. నాయకులు డి.వెంకటేష్‌, శ్రీధర్‌రావు, గిరిరాజు, దేవన్న, సూరిబాబు, రాంనాథ్‌, రఘు, రాముడు, నాగ రాజు పాల్గొన్నారు.

‘కార్మికుల హక్కులను హరిస్తున్న మోదీ’

కార్మికుల హక్కులను హరిస్తున్న ప్రధాని నరేంద్రమోదీకి పుట్టగతులుండవని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అంజనేయులు అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో, మెడికల్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో యూ నియన్‌ ఆధ్యక్షుడు వెంకటస్వామి ఎగురవేసారు. కార్యక్రమంలో నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, మధుసూదన్‌ బాబు, మెడికల్‌ కాంట్రాక్ట్‌ వర్సర్స్‌ యూనియన్‌ నాయకులు సమీద్‌బాషా, చామంతి, నరసింహ, అంజి, వెంకటేశ్వరమ్మ, లక్ష్మి, బాషా పాల్గొన్నారు.

- టీఎస్‌ఈఈ-327 యూనియన్‌ నాయకుల ఆధ్వర్యంలో జిలా ్లకేంద్రంలోని ఎస్‌ఈ కార్యాలయం వద్ద మేడే వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. కార్య క్రమంలో యూనియన్‌ నాయకులు ఉదయ్‌కిరణ్‌, ప్రసా ద్‌, సురేందర్‌బాబు, పరమేష్‌, రాఘవేంద్ర గౌడ్‌, మదన్‌, భూపాల్‌, శేఖర్‌, నాగేష్‌, వెంకటేష్‌, శ్రీకాంత్‌, చెన్నయ్య, షకీల్‌, రమేష్‌ పాల్గొన్నారు.

కార్మికుల హక్కులను పరిరక్షించుకుందాం

పోరాడి సాధించుకున్న హక్కుల పరిరక్షణ కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఐటీయూ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో వడ్డేపల్లి మునిసిపల్‌ కేంద్రం శాంతినగర్‌లో కార్మిక జెండాను ఎగురవేశారు. కార్యక్ర మంలో నాయకుడు పరంజ్యోతి, అనుబంధ సంఘాల నాయకులు, హమాలీ కార్మికులు పాల్గొన్నారు.

- గట్టు మండల పరిధిలోని బల్గెరలో సర్పంచ్‌ల సంఘం మాజీ అధ్యక్షుడు హన్మంతునాయుడు కార్మిక జెండాను ఎగుర వేశారు. బస్టాండ్‌ అవరణలో హమాలీ యునియన్‌, సీఐటీయూ ఆధ్వర్యంలో ఐద్వా జిల్లా కార్యదర్శి నర్మద ఎర్ర జెండాను ఆవిష్కరించారు. మాచర్లలో హమాలీ యూనియన్‌, సీఐటీయూ నాయకులు ఎర్ర జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జయన్న, చంద్రు, వెంకటేష్‌, బల్లరాముడు, రాజప్ప, రమేష్‌, మజీ సర్పంచ్‌ సామేల్‌, బాసునాయుడు, పొగాకు ఈరన్న పాల్గొన్నారు.

- ఉండవల్లి మండల కేంద్రంలో హమాలీ, సెంట్రింగ్‌, ఆటో యూనియన్‌ నాయకుల ఆధ్వర్యంలో మేడు ఉత్సవాలు నిర్వహించారు. రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు జీకే ఈదన్న, సీపీఎం మండల అధ్యక్షుడు ఎస్‌. మద్దిలేటి, సీఐటీయూ మండల కార్యదర్శి ఎం. వెంకటేశ్వర్లు జెండాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సెంట్రింగ్‌ యూనియన్‌ అధ్యక్షుడు ఖదీర్‌ బాషా, మధు, కృష్ణ, మద్దిలేటి, గడ్డం వెంకటేశ్వర్లు, సుంకన్న, వెంకట్రాముడు, సర్వేష్‌రెడ్డి, నరసింహ, వెంకటేష్‌, రాఘవేంద్ర, చెన్నరాయుడు పాల్గొన్నారు.

ఐకమత్యంతో ముందుకు సాగాలి

అయిజ పట్టణంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ముందు జిల్లా విద్యుత్‌ శాఖ కార్మిక సంఘం అధ్యక్షుడు రామకృష్ణ ఎర్ర జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డివిజనల్‌ అడిషనల్‌ సెక్రటరీ మహ్మద్‌, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ సర్వోత్తం, వీరేష్‌, తిరుమలేష్‌, సుధాకర్‌, కృష్ణ, మోహన్‌, కార్తిక్‌, రంగారెడ్డి పాల్గొన్నారు. అయిజ హమాలీ కార్మిక సంఘం కార్యాలయం వద్ద సీఐటీయూప జిల్లా కార్యదర్శి నరసింహ, కొత్త బస్టాండు రవిరెడ్డి జెండాను ఆవిష్కరించారు.

- మల్దకల్‌ సబ్‌స్టేషన్‌ వద్ద 327 యూనియన్‌ ఆర్గనైజింగ్‌ రాష్ట్ర కార్యదర్శి వెంకట్రాములు ఆధ్వర్యంలో కార్మిక జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో విద్యుత్‌ శాఖ సిబ్బంది పురుషోత్తం, బొజ్జయ్య, మురళి, మహేష్‌, చందు, సాయినాథ్‌ పాల్గొన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో బస్టాండు వద్ద జిల్లా కార్యదర్శి వీవీ నర్సింహ కార్మిక జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు గంగ న్న, తిమ్మప్ప, నాగేష్‌, తిమ్మోతి, పాంటన్న, సామేలు, బుచ్చన్న, దేవదాసు, నర్సింహులు పాల్గొన్నారు.

ఐక్య పోరాటాల్లో భాగస్వాములు కావాలి

హక్కుల సాధన కోసం ఐక్య పోరాటాల్లో భాగస్వాములు కావాలని యూటీఎఫ్‌ జిల్లా నాయకుడు ప్రకాష్‌ పిలుపునిచ్చారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ధరూరులోని వైఎస్సాఆర్‌ చౌరస్తా వద్ద నాయకులు జెండాను ఆవిష్కరించారు. ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల అధ్యక్షుడు మేకల నరసింహులు, గోవిందు, ప్రభుదాస్‌, దేవదాస్‌, గోష్‌, గోవిందు, రాజు, ప్రవీణ్‌ పాల్గొన్నారు.

- కేటీదొడ్డిలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఉరుకుందు జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో హమాలీలు వీరన్న, భీమన్న, నరేష్‌, తిమ్మప్ప పాల్గొన్నారు.

- అలంపూర్‌ మండల కేంద్రంలో ఆలిండియా ట్రేడ్‌ యూనియన్‌, సీఐటీయూ, సీపీఎం నాయకులు జెండాను ఆవిష్కరించారు. మండల పరిధిలోని లింగనవాయిలో రైతు సంఘం అధ్యక్షుడు జీకే ఈదన్న ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.

Updated Date - May 01 , 2024 | 11:13 PM