Share News

మేడే స్ఫూర్తిగా ఉద్యమిద్దాం

ABN , Publish Date - May 01 , 2024 | 10:56 PM

మేడే స్ఫూర్తిగా ఉద్యమిద్దామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బలరామ్‌ అన్నారు.

మేడే స్ఫూర్తిగా ఉద్యమిద్దాం

- సీఐటీయూ జిల్లా కార్యదర్శి బలరామ్‌

- ఘనంగా మేడే వేడుకలు

నారాయణపేట, మే 1 : మేడే స్ఫూర్తిగా ఉద్యమిద్దామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బలరామ్‌ అన్నారు. బుధవారం నారాయణపేట మునిసిపల్‌ పార్కు దగ్గర మే డే సందర్భంగా సీఐటీయూ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అమెరికా దేశంలోని చికాగో నగరంలో 1986, మే 3న రోజుకు ఎనిమిది గంటల పనిదినాలతో పాటు కార్మికుల హక్కులను పోరాడి సాధించుకున్న దినమే మే డే అన్నారు. మన దేశంలో స్వాతంత్య్రం పూర్వం నుంచి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం సవరించి నాలుగు కార్మిక కోడ్‌లుగా అమలు చేస్తే కార్మికులు మరోసారి బానిసత్వంలోకి నెట్టబడతారని ఆందోళన వ్వక్తం చేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు సాయిలు, బాలమణి, సౌభాగ్య, వనిత, ప్రదీప్‌, జయంత్‌రెడ్డి, పవన్‌, మాసనమ్మ, కృష్ణ, మున్నిబేగం పాల్గొన్నారు.

మక్తల్‌ : మేడే దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మక్తల్‌ పట్టణంలోని ఐఎఫ్‌టీయూ, సీఐటీయూ తదితర సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్‌ చౌరస్తాలో 138వ మేడే జెండా ఆవిష్కరించారు. ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు కిరణ్‌, సీఐటీయూ నాయకులు గోవిందరాజు, ఏఐటీయూసీ జిల్లా కమిటీ నాయకులు నర్సిములు, బుట్టో మాట్లాడారు. ప్రపంచ కార్మిక వర్గానికి ఎనిమిది గంటల పనిదినాలు కావాలని 1886 మే 1న అమెరికా చికాగో నగరంలో కార్మికులు శాంతియుతంగా పోరాటం చేశారన్నారు. కార్మికులపై పెట్టుబడిదారులు విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో అనేక మంది మరణించారన్నారు. ఈ సంఘటనకు గుర్తింపుగా ప్రపంచ వ్యాప్తంగా మే డే జరుపుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం 8 గంటల పనిదినాలకు చట్టబద్దత కల్పించడంతో పాటు కార్మికుల హక్కులు కాపాడాలన్నారు. కార్యక్రమంలో ఏఐపీకేఎస్‌ జిల్లా అధ్యక్షుడు భగవంతు, పీవోడబ్ల్యూ శారద, పీడీఎస్‌యూ భాస్కర్‌, కార్మిక సంఘం నాయకులు కొల్మి రాములు, ఈశ్వరయ్య, కార్మికులు ఆనంద్‌, నాగప్ప, రాజు, మోహన్‌రెడ్డి, స్కైలాబ్‌, అంజి, లక్ష్మణ్‌, కృష్ణయ్య, లింగన్న, గంగన్న, నరసింహ, తాయప్ప, వెంకటయ్య పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2024 | 10:56 PM