Share News

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

ABN , Publish Date - May 01 , 2024 | 11:00 PM

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ అన్నారు.

 మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఎస్సీ యోగేష్‌ గౌతమ్‌

- ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌

నారాయణపేట, మే 1 : యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ అన్నారు. బుధవారం తెలంగాణ యాంటి నార్కోటిక్స్‌ బ్యూరో ఆధ్వర్యంలో గంజాయి, కల్తీ కల్లు వినియోగం వల్ల జరిగే అనార్థాలపై రూపొందించిన పోస్టర్లను జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్సీ ఆవిష్కరించి, మాట్లాడారు. రాష్ట్రంలో గంజాయి, కల్తీ కల్లు వినియోగం వల్ల వ్యక్తులతో పాటు సమాజానికి జరిగే నష్టం తెలిపే విధంగా రూపొందించిన పోస్టర్లలో గంజాయి, కల్తీ కల్లు విక్రయాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. మాదక ద్రవ్యాలను అరికటడంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యువత గంజాయికి బానిసై తమ భవిష్యత్‌ను కోల్పోతున్నారన్నారు. జీవితాలను విచ్చిన్నం చేసుకోకుండా మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ లింగయ్య, మహేష్‌, రాంమ్‌లాల్‌, సునిత పాల్గొన్నారు.

జిల్లాలో 30, 30ఏ పోలీస్‌ యాక్ట్‌ అమలు

నారాయణపేట, మే 1 : జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని ఈనెల 31 వరకు నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 30, 30 ఏ పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉంటుందని ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ పేర్కొన్నారు. యాక్ట్‌ అమలు దృష్యా ఎలాంటి ధర్నాలు, నిరసన ర్యాలీలు, సమావేశాలు పోలీసుల అనుమతి లేకుండా నిర్వహించొద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రజా ఆస్తులను నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు. ఇందుకు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ప్రజలు, వివిధ సంఽఘాల నాయకులు సహకరించాలని కోరారు.

Updated Date - May 01 , 2024 | 11:00 PM