Share News

బావోజీ హుండీ ఆదాయం రూ.47 లక్షలు

ABN , Publish Date - Apr 30 , 2024 | 11:38 PM

మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో గిరిజనుల ఆరాధ్య దైవం బావోజీ ఆలయ హుండీ ఆదాయం రూ.47,53,578 లక్షలు వచ్చినట్లు ఆలయ ఈవో కోమల్‌ మంగళవారం తెలిపారు.

బావోజీ హుండీ ఆదాయం రూ.47 లక్షలు
హుండీ లెక్కిస్తున్న సిబ్బంది

కొత్తపల్లి, ఏప్రిల్‌ 30 : మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో గిరిజనుల ఆరాధ్య దైవం బావోజీ ఆలయ హుండీ ఆదాయం రూ.47,53,578 లక్షలు వచ్చినట్లు ఆలయ ఈవో కోమల్‌ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా సోమ, మంగళవారం రెండు రోజుల పాటు జాతరకు వచ్చిన భక్తులు సమార్పించిన కానుకలను లెక్కించారు. ఈ సందర్భంగా హుండీ ఆదాయం రూ.20,30,851 లక్షలు సమకూరగా, హనుమాన్‌ హుండీ ఆదాయం రూ.1,50,813 వచ్చింది. అదే విధంగా కాళీకాదేవి హుండీ ఆదాయం రూ.14,24,414, పోతుల వేలం రూ.70,000, తైబజార్‌ రూ.18,500, లడ్డూ ప్రసాదం రూ.20,000, కొబ్బరి చిప్పలు రూ.15,000, కొబ్బరి కాయలు రూ.3,00,000, తలనీలాలు రూ.7,15,000 లతో కలిపి మొత్తం ఆలయానికి రూ.రూ.47,53,578 లక్షల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. దీంతో పాటు 1290 గ్రాముల వెండి ఆభరణాలు వచ్చాయి.

Updated Date - Apr 30 , 2024 | 11:38 PM