Share News

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

ABN , Publish Date - May 01 , 2024 | 11:24 PM

నేటి సమాజంలో అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, న్యాయసేవా సంస్థ అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
సదస్సులో మాట్లాడుతున్న న్యాయాధికారి కవిత

- సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి గంటా కవిత

గద్వాల టౌన్‌, మే 1 : నేటి సమాజంలో అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, న్యాయసేవా సంస్థ అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి, జిల్లా న్యాయప్రాధికార సంస్థ కార్యదర్శి గంటా కవిత అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను పురస్కరించుకుని బుధవారం పట్టణంలోని మునిసిపల్‌ కార్యాలయం వద్ద జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయాధికారి మాట్లాడుతూ దైనందిన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు న్యాయవిజ్ఞాన సదస్సులో అందించే సమాచారం, సల హాలు దోహదపడతాయన్నారు. న్యాయపరమైన సమస్యలను ప్రతీ శనివారం నిర్వహించే లోక్‌అదాలత్‌ ద్వారా రాజీ చేసుకునే అధికారం ఉంటుందన్నారు. సమావేశంలో లీగల్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ న్యాయవాది డి.లక్ష్మన్న, ఎంసీహెచ్‌ వెంకటేష్‌, అబ్రహాం, శ్రీకర్‌ పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2024 | 11:24 PM