Share News

ఓటర్‌ స్లిప్పులు అందించాలి

ABN , Publish Date - May 02 , 2024 | 12:27 AM

లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు ప్రతి ఓటరుకు ఓటర్‌ స్లిప్పులను అందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికా స్‌రాజ్‌ ఆదేశించారు.

ఓటర్‌ స్లిప్పులు అందించాలి

పెద్దపల్లి, మే 1 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు ప్రతి ఓటరుకు ఓటర్‌ స్లిప్పులను అందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికా స్‌రాజ్‌ ఆదేశించారు. బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్‌ స్థానానికి పోటిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య ఆధారంగా అవసరమైన అదనపు బ్యాలెట్‌ యూనిట్లు ర్యాం డమైజేషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. ఈవీఎం యంత్రాలపై బ్యాలెట్‌ పత్రాల కమీషనింగ్‌కు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం నుంచి అవసరమైన మేర పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్లు అసెంబ్లీ సెగ్మెంట్‌ వారీగా పంపిణీ చేయాలని సూచించారు. పారదర్శకంగా హోం ఓటింగ్‌ ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ప్రతి పార్లమెంట్‌ పరిధిలో తుది ఓటర్‌ జాబితా రూపొందించామని, ప్రతి ఓటర్‌ కు ఓటర్‌ సమాచార స్లిప్పులు పంపిణీ చేయాలన్నారు. పోలింగ్‌ కేంద్రాలలో అవసరమైన మౌళిక వసతు లు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు జీవీ శ్యామ్‌ప్రసాద్‌ లాల్‌, అరుణశ్రీ, ఆర్‌డీఓలు హనుమా నాయక్‌, డీపీఓ ఆశాలత పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2024 | 12:27 AM