Share News

ఎన్టీపీసీ అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకం

ABN , Publish Date - May 02 , 2024 | 12:21 AM

ఎన్టీపీసీ అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలక మని, కార్మికుల శ్రమ ఫలితంగానే ప్రపంచస్థాయి సంస్థగా ఎన్టీపీసీ ఎదిగిందని రామగుండం, తెలంగాణ ఎన్టీపీసీ ఈడీ కేదార్‌ రంజన్‌ పాడు పేర్కొన్నారు.

ఎన్టీపీసీ అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకం

జ్యోతినగర్‌, మే 1 : ఎన్టీపీసీ అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలక మని, కార్మికుల శ్రమ ఫలితంగానే ప్రపంచస్థాయి సంస్థగా ఎన్టీపీసీ ఎదిగిందని రామగుండం, తెలంగాణ ఎన్టీపీసీ ఈడీ కేదార్‌ రంజన్‌ పాడు పేర్కొన్నారు. మేడే సందర్భంగా బుధవారం ప్రాజెక్టులోని మేడే పార్కులో ఈడీ ఎన్టీపీసీ జెండాను ఎగురవేశారు. అనంతరం ఈడీ ప్రసంగించారు. ఎన్టీపీసీ కార్మికులు శ్రమ వులని, నాణ్యమైన విద్యుత్‌ ఉత్పత్తికి అంకితభావంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. కార్మికుల సంక్షేవనికి ఎన్టీపీసీ యాజమాన్యం అధిక ప్రాధాన్యతని స్తుందని తెలిపారు. కార్మికులు విధి నిర్వహణలో రక్షణ సూత్రాలను పాటించాలని, తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని ఈడీ కేదార్‌ రంజన్‌ సూచించారు. భవిష్యత్‌లో ఇదే స్ఫూర్తితో పని చేసి సంస్థను ముందుకు తీసుకవెళ్లాలని కోరారు. కార్యక్రమంలో జీఎం(ఒఅండ్‌ ఎం) ఎ.కె.త్రిపాఠి, ఎన్‌బీసీ సభ్యుడు, గుర్తింపు సంఘం నేత బాబర్‌ సలీం పాష, అధ్యక్ష, కార్యదర్శులు వేముల కృష్ణయ్య, ఆరెపల్లి రాజే శ్వర్‌, కార్మికులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2024 | 12:21 AM