Share News

వేసవి ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - May 01 , 2024 | 12:03 AM

సింగరేణి యాజమాన్యం కల్పిం చే వేసవి ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఆర్జీ-3 జీఎం సుధాకర్‌రావు అన్నారు.

వేసవి ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

రామగిరి, ఏప్రిల్‌ 30: సింగరేణి యాజమాన్యం కల్పిం చే వేసవి ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఆర్జీ-3 జీఎం సుధాకర్‌రావు అన్నారు. మంగళవారం ఆర్జీ- 3 డివిజన్‌ పరిధిలోని రాణిరుద్రమాదేవి క్రీడా ప్రాంగణంలో వర్క్‌పీపుల్స్‌అండ్‌ స్పోర్ట్స్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తు న్న వివిధ రకాల ఉచిత క్రీడా శిక్షణ తరగతులను జీఎం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో పిల్లల శారీరకదారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 25 రోజుల పాటు నిర్వహించే వివిధ క్రీడాశిక్షణలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదికారులు రఘుపతి, సిహెచ్‌ వెంకటరమణ, ముప్పిడి రవీందర్‌ రెడ్డి, లక్ష్మీనారాయణ, సునీల్‌ప్రసాద్‌, క్రీడాకారులు వెంకటనరసింహారెడ్డి, అంజి, ప్రసాద్‌, వెంకటేశ్వర్లు, శిక్షకులు ముఖేష్‌కు మార్‌, నాగరాజు, రవీ పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2024 | 12:03 AM