Share News

ఎన్నికల సంఘం మార్గదర్శకాలపై అవగాహన ఉండాలి

ABN , Publish Date - May 02 , 2024 | 12:32 AM

పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ఎన్నికల ప్రక్రియ ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలపై సంపూర్ణ అవగహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో నిర్వర్తించాల్సిన భాధ్యతలపై ప్రిసైడింగ్‌, సహాయ ప్రిసైడింగ్‌ అఽధికారులు ఓపీవోలకు సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలతోపాటు వేములవాడ పట్టణంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బుధవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు

ఎన్నికల సంఘం మార్గదర్శకాలపై అవగాహన ఉండాలి
ఎన్నికల అధికారుల శిక్షణలో మాట్లాడుతున్న కలెక్టర్‌

- కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల కలెక్టరేట్‌, మే 1: పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ఎన్నికల ప్రక్రియ ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలపై సంపూర్ణ అవగహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో నిర్వర్తించాల్సిన భాధ్యతలపై ప్రిసైడింగ్‌, సహాయ ప్రిసైడింగ్‌ అఽధికారులు ఓపీవోలకు సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలతోపాటు వేములవాడ పట్టణంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బుధవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులను కలెక్టర్‌ పరిశీలించారు. పోలింగ్‌ రోజున ప్రిసైడింగ్‌, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు చేయాల్సిన విధులపై దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భం గా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ ఎన్నికల కమిషన్‌ నిర్ధేశించిన నియమ నిబంధనలపై ప్రిసైడింగ్‌, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు, ఓపీవోలు అవగాహన కలిగి ఉంటే నమ్మకంతో పారద ర్శకంగా ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించవచ్చని పేర్కొన్నారు. పోలింగ్‌ జరిగే సమయంలో పోలింగ్‌ కేంద్రాల్లో పాటించాల్సిన నిబంధనలు , కంట్రోల్‌ యూనిట్‌, బ్యాలెట్‌ యూనిట్‌, వీవీప్యాట్‌ల మధ్య కనెక్షన్‌ ఓటింగ్‌ కంపార్మ్టెంట్‌ రూపోందించడం ఓటరుగా గోప్యంగా తన ఓటు హక్కును వినియోగించేందుకు అవకాశం కల్పించడం వంటి ఏర్పాట్లపై ప్రిసైడింగ్‌, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు ఓపీవోలు తీసుకోవాల్సిన చర్యలు వారికి ఉన్న హక్కులు భాధ్యతలను సంపూర్ణంగా తెలుసుకొని ప్రతీ పోలింగ్‌ అధికారికి అవగహన కల్పించాలని కలెక్టర్‌ సూచించారు. పోలింగ్‌రోజు ఏమైనా సందేహాలు ఉన్నా, సమస్యలు ఎదురైనా సెక్టార్‌ అధికారులకు తెలియజేయాలని కోరారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్‌ పూజారి గౌతమి, అర్డీవోలు రాజేశ్వర్‌, రమేష్‌, సీపీవో పీబీ శ్రీనివాసచారి, తహసీల్దార్‌లు షరీఫ్‌ మోహీనోద్దీన్‌, మహేష్‌కుమార్‌ పాల్గొన్నారు.

- పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు..

సజావుగా పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ అన్నారు. బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌, ఇతర ఉన్నతాధికారులతో కలిసి హోం ఓటింగ్‌, ఓటర్‌ స్లిప్పుల పంపిణీ, వెబ్‌ క్యాస్టింగ్‌, తదితర అంశాల పై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సమీకృత జిల్లా కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా వికాస్‌రాజ్‌ మాట్లాడుతూ పార్లమెంట్‌ స్థానానికి పోటిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య ఆధారంగా అవసరమైన అదనపు బ్యాలెట్‌ యూని ట్లు ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఈవీఎంలపై బ్యాలెట్‌ పత్రాల కమిషనింగ్‌కు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాల ని అన్నారు. పారదర్శకంగా హోం ఓటింగ్‌ ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని, అవసరమైన బృం దాలను ఏర్పాటు చేయాలన్నారు. మే 3 నుంచి 5 వరకు మొదటి విడత, మే 8న రెండో దశ హోం ఓటింగ్‌ పూర్తి చేయాలన్నారు.ప్రతి ఓటర్‌కు ఓటర్‌ సమాచార స్లిప్పు పంపిణీ అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్‌ జయంతి మాట్లాడుతూ జిల్లాలో తుది ఓటరు జాబితా రూపొందించి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందజేశామన్నారు. జిల్లాలో ఇప్పటివర కు 2 లక్షల 88 వేల 153 మంది ఓటర్లకు (61 శాతం) ఓటర్‌ సమా చార స్లిప్పులు పంపిణీ చేశామన్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 277 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌, 197 పోలింగ్‌ కేంద్రాల బయట ిసీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అన్నారు. సమావేశంలో ఆదనపు కలెక్ట ర్‌ పి గౌతమి, సిరిసిల్ల, ఆర్డీఓలు రమేష్‌, డీడబ్ల్యూఓ లక్ష్మీరాజం, సీపిఓ శ్రీనివాసాచారి, కలెక్టరేట్‌ ఏవో రాంరెడ్డి అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2024 | 12:32 AM