Share News

రామగుండంలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

ABN , Publish Date - May 02 , 2024 | 12:23 AM

భానుడు భగభగమంటున్నాడు.

రామగుండంలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

కళ్యాణ్‌నగర్‌, మే 1: భానుడు భగభగమంటున్నాడు. నిన్నమొన్నటి వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నా గత పదిరోజులుగా ఎండలు మం డుతున్నాయి. ఉదయం 6గంటలకే భగభగమంటున్నాడు. రామగుండం లో బుధవారం రాష్ట్రంలోనే అత్యధికంగా 46డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మంగళవారం 44డిగ్రీలు నమోదు కాగా బుధవారం రెండు డిగ్రీలు పెరిగి 46డిగ్రీలు నమోదు అయ్యింది. ఉదయం 11గంటలకు లక్ష్మీ నగర్‌లోని వాణిజ్య, వ్యాపార కేంద్రాలు బోసిపోయాయి. ఎండవేడిని తట్టు కోలేక ప్రజలు బయటకురావడం లేదు. ఉదయం 10గంటలకే రామగుం డంలో 41డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు చేసుకోవడం గమనార్హం. జనం అత్య వసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావడం లేదు. రాత్రి 10గంటలు దాటినా ఎండవేడి తగ్గడం లేదు. రెండు రోజులుగా భానుడు ప్రతాపం చూపుతుండడంతో జనం విలవిలాడుతున్నారు. ఎండ వేడికి ఏసీలు, కూ లర్ల ప్రభావం కూడా సరిపోవడం లేదు. ఓసీపీల్లో 49డిగ్రీల వరకు ఉష్ణో గ్రతలు నమోదు అవుతున్నాయి. రెండవ షిప్టు విధులకు వెళ్లాలంటే కార్మి కులు భయపడుతున్నారు. షిప్టు సమయాలు మార్చాలని యూనియన్లు డిమాండ్‌ చేస్తున్నా యాజమాన్యం స్పందించడం లేదు. మరో నెల రోజు లు ఎండల ప్రభావం ఎలా ఉంటాయోనని ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

Updated Date - May 02 , 2024 | 12:24 AM