Share News

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం

ABN , Publish Date - May 01 , 2024 | 12:00 AM

కాం గ్రెస్‌ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని, నిరుద్యోగు లకు ఉద్యోగాలు వస్తాయని పెద్దప ల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ అన్నా రు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం

కాల్వశ్రీరాంపూర్‌, ఏప్రిల్‌ 30: కాం గ్రెస్‌ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని, నిరుద్యోగు లకు ఉద్యోగాలు వస్తాయని పెద్దప ల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ అన్నా రు. మండల కేంద్రంలో మంగళవా రం ఎమ్మెల్యే చింతకుంట విజయర మణారావుతో కలిసి ఆయన కార్నర్‌ సమావేశంలో మాట్లాడారు. తాను ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టి 500 మంది యువకులకు ఉద్యోగాలు కల్పించానని, తనకు ఎంపీగా అవ కాశం ఇస్తే పెద్దపల్లి అభివృద్ధితో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవ కాశాలు కల్పిస్తానన్నారు. రేషన్‌ కార్డులు కూడా లేని వా రికి రేషన్‌ కార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు. తనను ఆశీర్వదించి ఎంపీగా గెలిపించాలని అభ్యర్థించారు. ఎ మ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ సీఎం రేవం త్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల విద్యుత్‌ మాఫీ, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌తో పాటు వచ్చే పంద్రాగస్టులోపు రైతుల కు రెండు లక్షల రుణమాఫీ జరుగుతుందన్నారు. వచ్చే వానకాలం పంట నుంచే రూ.500లు రైతులకు బోనస్‌ ఇవ్వడం జరుగుతుందన్నారు. తెలంగాణ ఇచ్చిన సోని యా గాంధీ కేంద్రంలో రాహుల్‌ ప్రధానమంత్రిని చేస్తే ఐదు పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. స్వామినాథన్‌ కమిటీ ప్రకారం అన్ని పంటలకు మద్దతు ధర, ఉపాధి హామీ కూలీలకు రూ.400 కూలీ, ప్రతి తెల్ల రేషన్‌ కార్డు ఉన్న మహిళకు లక్ష రూపాయలు, సంవ త్సరానికి 30లక్షల ఉద్యోగాలు, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ రూ.25 లక్షలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇండ్లు లేని వారం దరికీ జూన్‌ 15 నుంచి ఇందిరమ్మ ఇండ్లకు ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్‌, మాజీ మత్స్యశాఖ రాష్ట్ర అధ్యక్షుడు చేతి ధర్మయ్య, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అప్పుల తెలంగాణగా మార్చారు..

ఓదెల, ఏప్రిల్‌ 30 : నీళ్లు, నిధులు, నియామకాల పే రుతో పాలనలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొమ్మి దేళ్లు పాలించి అప్పుల తెలంగాణగా మార్చారని కాంగ్రెస్‌ పార్లమెంట్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఎమ్మెల్యే విజయరమణరావు, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌తో కలిసి వంశీ ఎన్నిక ల ప్రచారాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా వంశీ మా ట్లాడుతూ ఉపాధి పథకాన్ని 20 ఏళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు నిర్వీర్యం చేశాయన్నారు. కార్యక్రమంలో ఎమ్మె ల్యే చింతకుంట విజయరమణరావు, మాజీ ఎమ్మెల్యే ఆరె పల్లి మోహన్‌, మండల అధఽ్యక్షులు మూల ప్రేంసాగర్‌రె డ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌ ఆళ్ల సుమన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2024 | 12:00 AM