Share News

పదవీ విరమణ పొందిన పోలీస్‌ అధికారులకు వీడ్కోలు

ABN , Publish Date - May 01 , 2024 | 12:32 AM

కరీంనగర్‌ పోలీస్‌ కమీషనరేట్‌లో ఎస్‌ఐ మొహమ్మద్‌ ఆరిఫుద్దీన్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ సారంగధర మంగళవారం పదవి విరమణ పొందారు.

పదవీ విరమణ పొందిన పోలీస్‌ అధికారులకు వీడ్కోలు

కరీంనగర్‌ క్రైం, ఏప్రిల్‌ 30: కరీంనగర్‌ పోలీస్‌ కమీషనరేట్‌లో ఎస్‌ఐ మొహమ్మద్‌ ఆరిఫుద్దీన్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ సారంగధర మంగళవారం పదవి విరమణ పొందారు. కమీషనరేట్‌ కేంద్రంలోని కాన్ఫరెన్స్‌హాలులో వారికి వీడ్కోలు కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా అడిషనల్‌ డీసీపీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ అనివార్యమన్నారు. ఎన్నో సవాళ్లతో కూడుకుని వున్న పోలీస్‌ ఉద్యోగం సంపూర్ణంగా పూర్తి చేసి పదవి విరమణ పొందడం గొప్ప విషయం అన్నారు. పదవీ విరమణ పొందుతున్న అధికారులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. అనంతరం పదవీ విరమణ పొందుతున్న అధికారులకు డీసీపీ పూలమాలవేసి, శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ ఏ లక్ష్మీనారాయణ, ఆర్‌ఐ శ్రీధర్‌ రెడ్డి(వెల్ఫేర్‌), ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2024 | 12:32 AM