Share News

శాంతియుత ఎన్నికల నిర్వహణకు కృషి చేయాలి

ABN , Publish Date - May 02 , 2024 | 12:34 AM

శాంతియుతంగా ఎన్నికల నిర్వాహణకు ప్రతి ఒక్కరు కృషిచేయాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకొని ఎలాంటి లోటుపాట్లు జరగకుండా క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన భద్రత ఏర్పాట్లపై అన్ని పోలీస్‌స్టేషన్‌ల ఎస్‌హెచ్‌వోలతో సమీక్ష సమావేశం నిర్వహించి ఎస్పీ దిశానిర్ధేశం చేశారు.

శాంతియుత ఎన్నికల నిర్వహణకు కృషి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

- లోక్‌సభ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు

- ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

సిరిసిల్ల క్రైం, మే 1: శాంతియుతంగా ఎన్నికల నిర్వాహణకు ప్రతి ఒక్కరు కృషిచేయాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకొని ఎలాంటి లోటుపాట్లు జరగకుండా క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన భద్రత ఏర్పాట్లపై అన్ని పోలీస్‌స్టేషన్‌ల ఎస్‌హెచ్‌వోలతో సమీక్ష సమావేశం నిర్వహించి ఎస్పీ దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల సంఘం నియంత్రణలో క్రమశిక్షణతో పనిచే యాలన్నారు. ఎన్నికల్లో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూసుకోవాలన్నారు. లోక్‌సభ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులతో పాటుగా విజిబుల్‌ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. డైనమిక్‌ చెక్‌ పోస్టులు ఏర్పాటుచేసి ముమ్మర తనిఖీలు నిర్వహిస్తూ అక్రమంగా మద్యం, డబ్బు తరలించకుండా అడ్డుకట్ట వేయాలన్నారు. ఎన్నికల విధులకు సంబంధించిన నిర్ధిష్టమైన సూచనలను తమ కింది స్థాయి సిబ్బందికి అందించాలన్నారు. అధికారులు, సిబ్బంది గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ భద్రత చర్యలు చేపట్టాలన్నారు. పోలీస్‌ అధికారులు, సిబ్బంది తరుచు పోలింగ్‌ కేంద్రాలను సందర్శిస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలన్నా రు. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించే వ్యక్తుల మీద నిఘా వేసి ఉంచాలన్నారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఓటర్లను ప్రలోభపరిచేలా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలుచేస్తూ అక్రమ మద్యం, నగదు పంపిణీలపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. లోక్‌ సభ ఎన్నికల సందర్భంగా సోషల్‌ మీడియాపై దృష్టి పెట్టాలన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టెలా ప్రజలను తప్పుదోవ పట్టించేలా వచ్చే ప్రకటనలు, ఫొటోలు షేర్‌చేసే వారిపై కఠినంగా వ్యవహారించాలన్నారు. సమావేశంలో ట్రైనీ ఐపీఎస్‌ రాహుల్‌రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల, వేములవాడ డిఎస్పీలు చంద్రశేఖర్‌రెడ్డి, నాగేంద్రచారి, మురళీకృష్ణ, సర్వర్‌, సీఐలు రఘుపతి, సదన్‌కుమార్‌, శ్రీనివాస్‌, వీరప్రతాప్‌, వెంకటేశ్వర్లు, అనిల్‌కుమార్‌, శ్రీనివాస్‌, ప్రవీణ్‌కుమార్‌, మధుకర్‌, ఆర్‌ఐలు యాదగిరి, మధుకర్‌, రమేశ్‌, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2024 | 12:34 AM