Share News

సైబర్‌ నేరస్థుల ఉచ్చులో పడి మోసపోవద్దు

ABN , Publish Date - May 02 , 2024 | 12:20 AM

సైబర్‌ నేరస్థుల ఉచ్చులో పడి మోసపోవద్దని, సైబర్‌ నేరాలపై అవగాహన పెంపొందించుకోవాలని గోదావరిఖని సైబర్‌ సెక్యూరిటీ ఏసీపీ వెంకట రమణ పిలుపునిచ్చారు.

సైబర్‌ నేరస్థుల ఉచ్చులో పడి మోసపోవద్దు

కోల్‌సిటీ, మే 1: సైబర్‌ నేరస్థుల ఉచ్చులో పడి మోసపోవద్దని, సైబర్‌ నేరాలపై అవగాహన పెంపొందించుకోవాలని గోదావరిఖని సైబర్‌ సెక్యూరిటీ ఏసీపీ వెంకట రమణ పిలుపునిచ్చారు. సైబర్‌ జాగృకత దివాస్‌ కార్యక్రమంలో భాగంగా బుధవా రం గోదావరిఖనిలోని సింగరేణి ఇన్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌సైనెస్‌(సిమ్స్‌)లో విద్యార్థు లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఓటీపీ ఫ్రాడ్స్‌, బయోమెట్రిక్‌ కెడిక్‌ కార్డ్స్‌, ఇన్వెస్ట్‌మెంట్స్‌, ఆన్‌లైన్‌ పేమెంట్స్‌, అడ్వటైజ్డ్‌మెంట్స్‌, పెటెక్స్‌ కొరియర్‌ల పేర ఫ్రాడ్‌లు, లోన్‌యాప్‌లు, నకిలీ వెబ్‌సైట్ల గురించి తెలిపారు. ఆన్‌లైన్‌ మోసాలను అడ్డుకట్ట వేసేందుకు తీసుకోవాల్సిన చర్య లను వివరించారు. కార్యక్రమంలో సైబర్‌ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్‌ కృష్ణమూర్తి, కళాశా ల ప్రొఫెసర్లు, సైబర్‌ సెక్యూరిటీ పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2024 | 12:20 AM