Share News

పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల్లో బీజెపీ గెలుపు ఖాయం..

ABN , Publish Date - May 15 , 2024 | 12:51 AM

పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్‌ సరళని బట్టి చూస్తే పెద్దపల్లి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్‌ గెలు పు ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌ కుమార్‌ అన్నా రు.

పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల్లో బీజెపీ గెలుపు ఖాయం..

పెద్దపల్లి, మే14(ఆంధ్రజ్యోతి): పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్‌ సరళని బట్టి చూస్తే పెద్దపల్లి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్‌ గెలు పు ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌ కుమార్‌ అన్నా రు. మంగళవారం ఆయన పెద్దపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏరాఁటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెండు నెలల నుంచి బీజేపీ అభ్యర్థి గొమాసే శ్రీనివాస్‌ గెలుపు కోసం రాత్రింబవళ్ళు పనిచేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. వారి కష్టం వృథా కాకుండా పెద్దపల్లి పార్లమెంట్‌ ఏర్ప డిన తర్వాత మొట్టమొదటిసారిగా పెద్దపల్లి పార్లమెంట్లో కాషాయ జెండా ఎగురబోతున్నదని అన్నారు. ఎవరిని అడిగినా ప్రతి పది మందిలో ఏడు, ఎని మిది మంది బిజెపికే ఓటువేశామని చెబుతున్నారని తెలిపారు. గత ఎన్నికలలో కూడా ఏలాంటి ప్రభావం లేని ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ పార్లమెంటులలో గెలిచామని, అలాగే కరీంనగర్‌ పార్లమెంటులో మెజార్టీగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మె ల్యేలు ఉన్నా ఆ పార్లమెంటులో బండి సంజయ్‌ కుమార్‌ గెలిచారని తెలిపారు. ఫైనల్‌గా గెలుపోటములు నిర్ణయించేది కేవలం ఓటర్లు మాత్రమేనని 100శాతం ప్రతి బూతులో, ప్రతి ఊర్లో బీజేపీ గెలవాలని ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేశా రన్నారు. వారికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. 60 ఏళ్లలో ఇతర పార్టీల పాలనలో లేని నీతివంతమైన ధర్మబద్దమైన పాలన మోడీ 10 సంవత్సరాల పాలనలో ప్రజలు చూడడం జరిగిందన్నారు. మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశ జిడిపి పెరిగిందని, ప్రపంచస్థాయిలో అనేక రంగాలలో ముందుకు పోవడం జరిగిందనీ తెలిపారు. .ప్రజలకు వారు సమర్ధవంతమైన పాలన, బలమైన నాయకత్వాన్ని ఈ భారతదేశానికి అందించారనీ అన్నారు. బీజెపీ చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కలిఁంచిందని తెలిపారు. అలా గే దళిత వర్గానికి న్యాయం చేయడమే కాకుండా దళిత వర్గంలో ఉన్నటువంటి ఉపకులాలకు మేలు చేసేలా కమిషన్ను కూడా వేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం లో మొట్టమొదటిగా బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని బిజెపి పార్టీ కట్టుబడి ఉన్నది కాబట్టే ఈ పార్లమెంట్లో బీసీలు అత్యధికంగా బిజెపికి ఓట్లు వేశారని పేర్కొన్నారు. మోడీని మరోసారి ఈ దేశ ప్రధానిగా చేసేందుకు పెద్దపల్లి పార్ల మెంటు నియోజకవర్గ ఓటర్లు ఇక్కడ అభ్యర్థిని గెలిపించి కానుకగా ఇవ్వాలని ఓట్లు వేశారన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షీలారపు పర్వతాలు అసెంబ్లీ కన్వీనర్‌ దాడి సంతోష్‌, తంగెడ రాజేశ్వర రావు పోల్సని సంపత్‌రావు, మండల అధ్యక్షులు కావేటి రాజగోపాల్‌, మేకల శ్రీనివాస్‌, కొదాటి రమణరావు, రాజన్న పటేల్‌, కారంగుల శ్రీనివాస్‌, కొప్పుల మహేష్‌, చిలువేరు సంపత్‌, కూకట్ల నాగరాజు, కౌన్సిలర్‌ రాజం మహంత కృష్ణ, నాయకులు ఈర్ల శంకర్‌, ఎర్రోళ్ల శ్రీకాంత్‌, పెంజర్ల రాకేష్‌, వే ల్పుల రమేష్‌, గుడ్ల సతీష్‌, చిలుక తిరుపతి, మధుకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2024 | 12:51 AM