Share News

Telangana: అక్రమ కట్టడాల కూల్చివేతకు స్పెషల్‌ డ్రైవ్‌ పెట్టండి: చాడ వెంకట్ రెడ్డి

ABN , Publish Date - Apr 19 , 2024 | 08:54 AM

హైదరాబాద్‌(Hyderabad) నగరంలోని నాలాలు, చెరువుల మీద అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేసేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డిని(CM Revanth Reddy) కోరుతూ సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి(Chada Venkat Reddy) గురువారం లేఖ రాశారు.

Telangana: అక్రమ కట్టడాల కూల్చివేతకు స్పెషల్‌ డ్రైవ్‌ పెట్టండి: చాడ వెంకట్ రెడ్డి
Chada Venkat Reddy

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌(Hyderabad) నగరంలోని నాలాలు, చెరువుల మీద అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేసేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డిని(CM Revanth Reddy) కోరుతూ సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి(Chada Venkat Reddy) గురువారం లేఖ రాశారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, బడా రాజకీయ నాయకులు వేలాది చెరువులను, కాలువలను ఆక్రమించి విల్లాలు, అపార్ట్‌మెంట్లు నిర్మించారని పేర్కొన్నారు. ఈ నిర్మాణాల వల్ల మురుగు నీరు కాలనీల్లోకి వస్తుందని, ఇందుకు 2020లో వచ్చిన వరదలే నిదర్శనం అని గుర్తు చేశారు.

ఇవికూడా చదవండి:

టికెట్ ఇస్తే బీజేపీలోకి వచ్చేస్తా..

బస్సు లోపల్నుంచే జగన్ షో!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 19 , 2024 | 08:54 AM